భారీ లాభాలతొ ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి బయటపడి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 424 పాయింట్లు లాభపడి 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి రంగ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఐటీ రంగ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడైంది. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లే నష్టపోయాయి. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో దాదాపు 9శాతం పెరిగాయి. […]

భారీ లాభాలతొ ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 6:29 PM

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి బయటపడి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 424 పాయింట్లు లాభపడి 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి రంగ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఐటీ రంగ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడైంది. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లే నష్టపోయాయి. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో దాదాపు 9శాతం పెరిగాయి. నరేష్‌ గోయల్‌ సంస్థ నుంచి దూరంగా జరగడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టుబడులు పెట్టనుండటంతో షేర్లు పెరిగాయి. మరోపక్క డీఎల్‌ఫ్‌ షేరు కూడా దాదాపు 7శాతం పెరిగింది. దాదాపు రూ.3,175 కోట్లు సేకరించేందుకు క్యూఐపీకి వెళ్లనున్నట్లు జెట్‌ ప్రకటించడంతో షేర్లు ర్యాలీ చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఎన్టీపీసీ (3.28%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.23%), వేదాంత (3.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.75%), యస్ బ్యాంక్ (2.71%).

టాప్ లూజర్స్: ఇన్ఫోసిస్ (-1.23%), బజాజ్ ఆటో (-0.85%), ఐటీసీ (-0.68%), ఎల్ అండ్ టీ (-0.37%), టీసీఎస్ (-0.26%).