30వేల వరల్డ్‌ మ్యాప్‌లను కాల్చిపడేసిన చైనా

30వేల వరల్డ్‌ మ్యాప్‌లను కాల్చిపడేసిన చైనా

బీజింగ్ : చైనాలోని కస్టమ్స్ అధికారులు… ఆ దేశంలో ముద్రించిన 30,000 ప్రపంచ పటాల్ని నాశనం చేశారు. అయితే దీనికి కారణం.. ఆ మ్యాపుల్లో ఎక్కడా కూడా అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌లు  చైనా అధీనంలో ఉన్నట్లు లేకపోవడమే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని గతకొంత కాలంగా చైనా చెప్పుకొస్తోంది. చైనా సర్కార్ దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ రీజియన్‌లో భాగం కానీ.. ఇండియాకు మాత్రం కాదు. అలాగే తైవాన్ ఆదేశంలో అంతర్భాగం. అయితే అనుహుయి ప్రావిన్సులోని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 26, 2019 | 5:34 PM

బీజింగ్ : చైనాలోని కస్టమ్స్ అధికారులు… ఆ దేశంలో ముద్రించిన 30,000 ప్రపంచ పటాల్ని నాశనం చేశారు. అయితే దీనికి కారణం.. ఆ మ్యాపుల్లో ఎక్కడా కూడా అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌లు  చైనా అధీనంలో ఉన్నట్లు లేకపోవడమే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని గతకొంత కాలంగా చైనా చెప్పుకొస్తోంది. చైనా సర్కార్ దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ రీజియన్‌లో భాగం కానీ.. ఇండియాకు మాత్రం కాదు. అలాగే తైవాన్ ఆదేశంలో అంతర్భాగం. అయితే అనుహుయి ప్రావిన్సులోని ఓ కంపెనీ … వాటిని చైనా నుంచి వేరు చేస్తూ ప్రపంచ పటాలను ముంద్రించింది. ఈ పటాలను ఇంగ్లీషులో ముంద్రించారు. షాన్‌డంగ్ ప్రావిన్సులోని కింగ్‌డావు సిటీలో జరిగిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి. 803 పెట్టెల్లోని 28,908 పటాలను తగులబెట్టింది. ఎప్పుడైనా భారత సైనికులు అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే చాలు… తమ భూభాగంలోకి వచ్చేస్తున్నారని హడావుడి చేస్తోంది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ తనదేనని అనుకునేలా నాటకాలాడుతోంది. భారత్ మాత్రం… అరుణాచల్ ప్రదేశ్… మన దేశంలో భాగమనీ, అక్కడకు భారతీయులెవరైనా ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా వెళ్లొచ్చని స్పష్టం చేస్తోంది.

చైనా చేస్తున్న ఇలాంటి చర్యలు… రెండు దేశాల మధ్యా శాంతి ప్రక్రియకు భంగం కలిగిస్తున్నాయి. చైనాకు ఒక్క అంగుళం కూడా వదిలేది లేదంటున్న కేంద్ర ప్రభుత్వం… ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు, చైనాతో పోరాడేందుకు… ఈశాన్య సరిహద్దుల్లో భారీ ఎత్తున భద్రతా దళాల్ని మోహరించి… అనుక్షణం పర్యవేక్షిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu