AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో’ ! అమీషా పటేల్

బీహార్ ఎన్నికల్లో లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరఫున ప్రచారం చేయడానికి వెళ్లిన తనకు భయంకర అనుభవాలు కలిగాయని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. దౌద్ నగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు తనను బహుశా రేప్ చేసి, హతమార్చి ఉండేవారేమో అని ముంబై చేరుకున్న ఆమె వెల్లడించింది. నన్ను నేను రక్షించుకునేందుకు ఆ నియోజకవర్గం నుంచి, ఆ రాష్ట్రం నుంచి వేగంగా బయటపడ్డాను అని అమీషా పేర్కొంది. ప్రకాష్ చంద్ర తనను […]

'బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో' ! అమీషా పటేల్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 8:28 PM

Share

బీహార్ ఎన్నికల్లో లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరఫున ప్రచారం చేయడానికి వెళ్లిన తనకు భయంకర అనుభవాలు కలిగాయని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. దౌద్ నగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు తనను బహుశా రేప్ చేసి, హతమార్చి ఉండేవారేమో అని ముంబై చేరుకున్న ఆమె వెల్లడించింది. నన్ను నేను రక్షించుకునేందుకు ఆ నియోజకవర్గం నుంచి, ఆ రాష్ట్రం నుంచి వేగంగా బయటపడ్డాను అని అమీషా పేర్కొంది. ప్రకాష్ చంద్ర తనను బ్లాక్ మెయిల్ చేశాడని, బెదిరించడమే గాక, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అదొక పీడకల అని ఆమె అభివర్ణించింది. ముంబై వచ్చాక కూడా అతడు తనను బెదిరిస్తూ కాల్స్ చేశాడని, తన గురించి గొప్పగా చెప్పాలని ఒత్తిడి చేశాడని అమీషా పటేల్ వాపోయింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ప్రకాష్ చంద్ర తొసిపుచ్చాడు.

Follow Us