గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న‌టుడు న‌వ‌దీప్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న‌టుడు న‌వ‌దీప్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 12:57 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో న‌టుడు న‌వ‌దీప్ పాల్గొన్నాడు. సీరియ‌ల్ న‌టుడు, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటాడు న‌వదీప్. ఈ సంద‌ర్భంగా ఇలాంటి మంచి కార్య‌క్ర‌మం త‌లపెట్టిన సంతోష్ కుమార్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఈ య‌జ్ఞంలో మీరు భాగ‌స్వాములు కావాల‌ని, చైన్‌ని ఇలానే కొన‌సాగించాల‌ని న‌వ‌దీప్ త‌న అభిమానుల‌ని కోరాడు.

Read More:

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక