భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలు.. 6 రోజుల్లో రూ.106 కోట్లు!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12 రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది.
కరోనాకి ముందు రాష్ట్రంలో రోజూ 5 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడడంతో ఆదాయం స్తంభించిపోయింది. మే నెలలో తిరిగి ప్రారంభమైనా జూన్, జూలై మాసాల్లో ఆశించిన మేర లావాదేవీలు జరగలేదు. ప్రజల వద్ద నగదు లభ్యత లేకపోవడం, రుణాల మంజూరుకు ఆటంకాలు ఏర్పడడం, కరోనా వైరస్ భయంతో రిజిస్ట్రేషన్లకు జనం పెద్దగా ముందుకు రాలేదు. కానీ, జూలైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం, జూలైలో శ్రావణమాసం రావడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పుంజుకున్నాయి.
Read More: