ఊరేగింపును అడ్డుకున్న ఎస్ఐపై గ్రామస్తుల ఆగ్రహం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌ు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌కు సిద్ధం చేశారు. అయితే, రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను ఎస్ఐ కాలువ‌లో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగారు.

ఊరేగింపును అడ్డుకున్న ఎస్ఐపై గ్రామస్తుల ఆగ్రహం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 13, 2020 | 1:43 PM

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌ు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి ఉత్స‌వాల‌కు సిద్ధం చేశారు. అయితే, రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను ఎస్ఐ కాలువ‌లో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల‌కు వ్య‌తిరేకంగా పెద్దఏత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కిషోర్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ‌స్తుల‌ను శాంతిప‌జేసి, ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు కాస్త వెనక్కు తగ్గారు.

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి పూజ‌లు నిర్వ‌హించేందుకు ఎస్డీఎం నుంచి అనుమతి కూడా తీసుకున్నామ‌ని గ్రామస్తులు డీఎంకు వివరించారు. అయితే, స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ జయంత్ కుమార్ సింగ్ గ్రామానికి వెళ్లేసరిగా భారీ జనం గుమిగుడారు. దీంతో ఎస్ఐ పూజలు నిలిపివేయాల‌ని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులు అందుకు నిరాక‌రించ‌డంతో స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆ రాధాకృష్ణుల ప్ర‌తిమ‌ల‌ను చెరువులో విసిరివేశారు. దీంతో గ్రామ‌స్తులు అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ , ఎస్పీ గ్రామానికి చేరుకుని, స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని హామీ ఇవ్వ‌డంతో గ్రామస్తులు శాంతించారు. కాగా, క‌రోనా వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా విగ్రహాల ఊరేగింపుపై నిషేధం ఉందని ఎస్పీ తెలిపారు. అందుకే ఆ ప్ర‌తిమ‌ల‌ను తొలగించమని స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ కోరినప్పటికీ, గ్రామ‌స్తులు విన‌లేదన్నారు. జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.