జ‌ర్న‌లిస్ట్‌పై ఆర్జీవీ సినిమా.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

క‌రోనా సంక్షోభంలోనూ వ‌రుస సినిమాలు తీస్తూ.. ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. థియేట‌ర్లు బంద్ ఉండ‌టంతో ఆర్జీవీ వ‌ర‌ల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో త‌న సినిమాల‌ను విడుద‌ల చేస్తూ ప‌ర్ వ్యూ ఇంత అని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ఇప్ప‌టికే 'క్లైమాక్స్‌, నేకెడ్, ప‌వ‌ర్ స్టార్' వంటి సినిమాల‌ను..

జ‌ర్న‌లిస్ట్‌పై ఆర్జీవీ సినిమా.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 1:29 PM

క‌రోనా సంక్షోభంలోనూ వ‌రుస సినిమాలు తీస్తూ.. ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. థియేట‌ర్లు బంద్ ఉండ‌టంతో ఆర్జీవీ వ‌ర‌ల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో త‌న సినిమాల‌ను విడుద‌ల చేస్తూ ప‌ర్ వ్యూ ఇంత అని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ‘క్లైమాక్స్‌, నేకెడ్, ప‌వ‌ర్ స్టార్’ వంటి సినిమాల‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ‌. తాజాగా ‘క‌రోనా, మ‌ర్డ‌ర్, అల్లు, అర్నాబ్‌‌-ది న్యూస్ ప్రాస్టిట్యూట్‌, డేంజ‌ర‌స్’ వంటి సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వ‌ర్మ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌పై సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజాగా అర్నాబ్‌ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. బుధ‌వారం రాత్రి చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఈ వీడియోలో ఎదుటి వారిపై గ‌ట్టిగా అరుస్తున్న‌ట్టు మాట‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నేష‌న‌ల్ ఛానెల్‌ ఎడిట‌ర్ అర్నాబ్‌ గోస్వామిపై తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించి ఆర్జీవీ ప‌లు కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేశారు. అర్నాబ్‌ని వేశ్య‌తో పోలుస్తూ ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు వ‌ర్మ‌. వేశ్య ఇత‌రుల కోసం త‌న బ‌ట్ట‌లు తీస్తుంది. కానీ ఇత‌ను త‌న‌ని తాను ఆనందం పొందేందుకు ఇత‌రుల దుస్తులు తీస్తాడంటూ ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More:

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక