ఆ వివరాలన్నీ డిస్‌ప్లేలో పెట్టండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశం

కరోనా వేళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు

ఆ వివరాలన్నీ డిస్‌ప్లేలో పెట్టండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశం
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 2:42 PM

Telangana Private Hospitals: కరోనా వేళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చికిత్సలకు సంబంధించిన రేట్లు రోగులకు తెలిసేలా ఆసుపత్రుల్లోని పలు ప్రదేశాల్లో పెట్టాలని తెలిపింది. 2019 డిసెంబర్ 31 నాటికి విధించిన రేట్లనే ఇప్పుడు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్యాకేజీ ప్రైస్ నుంచి మినహాయింపు ఇచ్చిన ‘హై-ఎండ్ డ్రగ్స్’, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ల (పిపిఇ) కోసం గరిష్ట రిటైల్ ధర మాత్రమే వసూలు చేయాలని వెల్లడించింది. వాటి ధరలను కూడా డిస్‌ప్లేలో పెట్టాలని తెలిపింది. వర్గీకరించిన బిల్లులనే రోగుల నుంచి తీసుకోవాలని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం డైరెక్టర్ వెల్లడించారు. 

మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై వస్తోన్న కథనాలపై మంత్రి ఈటల రాజేందర్ సీరియస్‌ అవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ధోరణిని మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన మంత్రి.. ఇప్పటికే రెండు ఆసుపత్రులపై కొరడా ఝళిపించారు. అయినా కొన్ని ఆసుపత్రులు తీరు మార్చుకోకపోవడంతో.. వాటికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని కోసం నేడో, రేపో ప్రైవేట్ కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యులతో సమావేశం కావాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అంటు వ్యాధుల చట్టం అమలైతే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై అన్ని అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. వివిధ జిల్లాల్లోని ఉన్నతాధికారులకు సైతం ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, కేసులు పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నట్లుగా సమాచారం.

Read More:

ఈ ఆగష్టు 15కు ఖైదీల విడుదల లేనట్లేనా!

మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు