AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!

జేఎన్టీయూహెచ్ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేందుకు...

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!
Ravi Kiran
|

Updated on: Aug 14, 2020 | 1:20 AM

Share

Online Classes From August 24: యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కోర్సులకు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్ధులు తమకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లలోనే పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. అలాగే సుమారు 60 వేల మంది విద్యార్ధులు(అటానమస్ కాలేజీలు) బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఏఐసీటీఈ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వగా.. జేఎన్టీయూ హైదరాబాద్ ఆగష్టు 24 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించనుంది. రోజుకు నాలుగు పిరియడ్స్ బోధించేందుకు అనుమతి ఇవ్వనుండగా.. ప్రతీ పిరియడ్‌ గంట చొప్పున.. మార్నింగ్ మూడు.. లంచ్ తర్వాత ఒక పిరియడ్ జరగనున్నాయి. కాగా, వీటనన్నింటిని నెల రోజుల పాటు సమీక్షించి.. ఆ తర్వాత టైం టేబుల్‌లో మార్పులు చేయనున్నారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!

ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

 ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..