ఢిల్లీలో నెలలో తొలి మంగళవారం ‘సుందరకాండ’ పారాయణం

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. బజ్‌రంగ్ బలీ-హనుమాన్’ అంశం కీలకంగా తెరపైకి వచ్చింది. ‘హనుమాన్ చాలీసా’ను స్వయంగా వినిపించిన కేజ్రీవాల్… తన ప్రచారాన్ని కూడా హనుమాన్ ఆలయంలో పూజలతో ప్రారంభించి, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హనుమాన్ ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడితో ఆ అంకం ముగియలేదు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ‘సుందరకాండ’ను తన భుజాన వేసుకున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం […]

ఢిల్లీలో నెలలో తొలి మంగళవారం 'సుందరకాండ' పారాయణం
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 9:36 PM

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. బజ్‌రంగ్ బలీ-హనుమాన్’ అంశం కీలకంగా తెరపైకి వచ్చింది. ‘హనుమాన్ చాలీసా’ను స్వయంగా వినిపించిన కేజ్రీవాల్… తన ప్రచారాన్ని కూడా హనుమాన్ ఆలయంలో పూజలతో ప్రారంభించి, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హనుమాన్ ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడితో ఆ అంకం ముగియలేదు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ‘సుందరకాండ’ను తన భుజాన వేసుకున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం తన నియోజవర్గంలోని పలు ప్రాంతాల్లో ‘సుందరకాండ’ పారాయణం జరుగుతుందని ప్రకటించారు. .

మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ కోసం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ‘సాయంత్రం 4.30 గంటలకు చిరాగ్‌లోని పురాతన శివాలయంలో సుందరకాండ పారాయణ జరుగుతుంది. మీ కారును ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ చేసుకుని నడిచి రండి. ప్రజలు చూపించిన ప్రేమ, హనుమాన్ ఆశీస్సులతోనే ఈ ఎన్నికల్లో నేను గెలిచాను’ అని ఆ ట్వీట్‌లో సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. హనుమాన్‌జీ ఆశీస్సుల కోసం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రతి నెలా మొదటి మంగళవారం సుందరాకాండ పారాయణకు నిర్ణయించామని, ఈ ప్రోగ్రాంలకు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం పలువురు సంప్రదించారని, స్పాన్సర్లు కూడా ముందుకొచ్చారని తెలిపారు.

ఢిల్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనను హనుమంతుడు దీవించాడని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ హనుమాన్ చాలీసా పారాయణను ఢిల్లీ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కోరారు.

[svt-event date=”18/02/2020,8:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో