AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో కొత్తగా మూడు.. ఇకపై 28 జిల్లాలు.. న్యూఇయర్ నుంచే అమలులోకి.!

కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ ఏపీ కొత్త మ్యాప్‌కు తుది రూపు ఇచ్చింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Andhra: ఏపీలో కొత్తగా మూడు.. ఇకపై 28 జిల్లాలు.. న్యూఇయర్ నుంచే అమలులోకి.!
AP CM Chandrababu Naidu
Ravi Kiran
|

Updated on: Dec 30, 2025 | 11:06 AM

Share

ఏపీలో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, మార్కాపురం జిల్లాలుగా, మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామని తెలిపింది. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది. గతంలో పారదర్శకంగా జిల్లా విభజన చేసుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు తెలిపారు.

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం కలిపి జిల్లా చేశామని… తిరుపతిలో కలవాలని రైల్వేకోడూరు ప్రజలు ఎప్పట్నుంచో కోరుతున్నారని మంత్రులు వివరించారు. బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుందన్నారు. జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెగా ఉంటుందని వెల్లడించారు. ఇక రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఆదోనిని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పరిపాలన సౌలభ్యం కోసమే రాయచోటిని మార్చారని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. తనకు పదవి లేకపోతే నష్టపోయేది తన కుటుంబం మాత్రమేనన్నారు. రాయచోటి ప్రజల భవిష్యత్‌కు ఇబ్బంది కలగనివ్వనని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి