AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!
Crime News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 02, 2026 | 12:01 PM

Share

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో అంజయ్యను కాస్త ఒత్తిడి చేసి మధ్యలోనే చిట్టి ఎత్తుకున్నారు. అయితే ఎత్తుకున్న చిట్టి డబ్బులు చెల్లించడం విషయం వివాదం రాజుకుంది. చిట్టి ప్రారంభించి, పూర్తయ్యేవరకూ కూడా ఆ చిట్టీలో భాగస్వాములైనవారు ప్రతీ నెలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా శ్రీను, అంజయ్యకు 12 వేల రూపాయలు ఇంకా కట్టాల్సి ఉంది. ఆ డబ్బులు కట్టాలని అంజయ్య కాస్త ఒత్తిడి తీసుకొచ్చాడు. తిరిగి కట్టాలని అడిగినందుకు, అంజయ్యను.. భాషాజీ శ్రీను, తన కొడుకు వేణుతో కలిసి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అంజయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

జగిత్యాల గోవిందుపల్లెకు చెందిన మృతుడు 58 ఏళ్ల కొలగాని అంజయ్యకు గణేష్ నగర్ కు చెందిన శ్రీనివాస్ కూ మధ్య ఒక లక్ష రూపాయల వ్యవహారంలో తేడాలు వచ్చాయి. ఆ తేడా కాస్తా గొడవగా ముదిరింది. దాంతో అంజయ్య.. శ్రీనివాస్ పై మరింత ఒత్తిడి పెట్టడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే గురువారం (జనవరి 01) ఏకంగా ఇంటికెళ్లి తిట్టడంతో.. తండ్రి శ్రీనివాస్ తో కలిసి, కొడుకు వేణు.. అంజయ్యతో గొడవకు దిగారు. దాంతో గొడవ ముదిరింది. కట్టెలు, పిడిగుద్దులతో కొట్టేసరికి కొలగాని అంజయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంజయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అంజయ్య ఆసుపత్రిలో మృతి చెందాడు. జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై ఈ గొడవ జరగ్గా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!
డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వింత డెలివరీ.. నవ్వాగదంతే
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వింత డెలివరీ.. నవ్వాగదంతే
శుక్ర వారం రోజు పుల్లటి ఆహారాలు తినకూడదా? ఎందుకో తెలుసా?
శుక్ర వారం రోజు పుల్లటి ఆహారాలు తినకూడదా? ఎందుకో తెలుసా?
2026ప్రయోగ రాజ్‌లో మాఘమేళ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం!
2026ప్రయోగ రాజ్‌లో మాఘమేళ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం!
కరకరలాడే తమిళనాడు స్టైల్ మురుకులు.. ఇంటిలోనే ఇలా ప్రిపేర్ చేయండి!
కరకరలాడే తమిళనాడు స్టైల్ మురుకులు.. ఇంటిలోనే ఇలా ప్రిపేర్ చేయండి!
కయాకింగ్ బోట్‌ బోల్తా.. జిల్లా కలెక్టర్‌కు తప్పిన ముప్పు!
కయాకింగ్ బోట్‌ బోల్తా.. జిల్లా కలెక్టర్‌కు తప్పిన ముప్పు!
ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం..
ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం..
'నేను పాకిస్తాన్ రంగేసుకున్న ఆసీస్ క్రికెటర్‌ని'
'నేను పాకిస్తాన్ రంగేసుకున్న ఆసీస్ క్రికెటర్‌ని'
భయపెట్టేస్తోన్న గోల్డ్, సిల్వర్ ధరలు.. గోల్డ్ ప్రియులకు ఇక ద..ద..
భయపెట్టేస్తోన్న గోల్డ్, సిల్వర్ ధరలు.. గోల్డ్ ప్రియులకు ఇక ద..ద..
ఏందీ సామి ఇంత పొడుగ్గా ఉన్నావ్.. చూస్తే షాక్!
ఏందీ సామి ఇంత పొడుగ్గా ఉన్నావ్.. చూస్తే షాక్!