Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్ఖండ్ ఎన్నికల్లో భారీగా నేర చరితులు..రేపిస్టులు కూడా..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశలో పోటీ చేస్తున్న 260 మంది అభ్యర్థులలో దాదాపు 17 శాతం అంటే.. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నలుగురు అభ్యర్థులు తమపై హత్య (ఐపిసి -302) కేసులను ప్రకటించగా, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను నలుగురు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి అత్యాచారానికి సంబంధించినది కావడం గమనార్హం. మరో ఎనిమిది మంది అభ్యర్థులు హత్యాయత్నానికి(ఐపిసి -307) సంబంధించిన కేసులు తమపై ఉన్నట్లు […]

జార్ఖండ్ ఎన్నికల్లో భారీగా నేర చరితులు..రేపిస్టులు కూడా..
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2019 | 2:45 PM

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశలో పోటీ చేస్తున్న 260 మంది అభ్యర్థులలో దాదాపు 17 శాతం అంటే.. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నలుగురు అభ్యర్థులు తమపై హత్య (ఐపిసి -302) కేసులను ప్రకటించగా, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను నలుగురు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి అత్యాచారానికి సంబంధించినది కావడం గమనార్హం. మరో ఎనిమిది మంది అభ్యర్థులు హత్యాయత్నానికి(ఐపిసి -307) సంబంధించిన కేసులు తమపై ఉన్నట్లు పేర్కొన్నారు. 

మొత్తం ఐదు దశల్లో జార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ నవంబర్ 30న జరగనుండగా,  రెండవ దశ డిసెంబర్ 7 న జరగనుంది. రెండవ దశలో జంషెడ్పూర్ ఈస్ట్, జంషెడ్పూర్ వెస్ట్, చైబాసా (ఎస్టీ), ఖుంటి (ఎస్టీ), సిమ్దేగా (ఎస్టీ) సహా 20 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  చేసిన సర్వే ప్రకారం వీరిలో..  కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న ఆరుగురు అభ్యర్థులలో ముగ్గురు,  జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి బరిలోకి దిగిన 14 మంది అభ్యర్థులలో ఐదుగురు,  బిజెపి నుంచి కంటెస్ట్ చేస్తోన్న 20 మంది అభ్యర్థులలో ఐదుగురు, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతంత్రిక్) పార్టీ నుంచి 20 మంది అభ్యర్థుల్లో.. ఐదుగురు ,ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులలో ఒకరు…  తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్స్‌లో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.