తిరుమల కొండపై ‘ప్రైవేట్’ హోమం.. వివాదంలో టీటీడీ సభ్యుడు..!
నిబంధనలకు విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు చెందిన ఓ సభ్యుడు హోమం నిర్వహించారు. ఈ హోమానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు మినహాయించి ఎవ్వరికీ ప్రవేశం కల్పించలేదు. అంతేకాదు ఈ హోమంలో దేశవ్యాప్తంగా సుమారు 60మంది రుత్వికులు పాల్గొన్నట్లు ఓ జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లే.. టీటీడీ సభ్యుడైన కృష్ణమూర్తి వైద్యనాథన్ ఇటీవల కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ హోమం(రుద్ర జప హోమం) నిర్వహించారు. ఇందులో […]

నిబంధనలకు విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు చెందిన ఓ సభ్యుడు హోమం నిర్వహించారు. ఈ హోమానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు మినహాయించి ఎవ్వరికీ ప్రవేశం కల్పించలేదు. అంతేకాదు ఈ హోమంలో దేశవ్యాప్తంగా సుమారు 60మంది రుత్వికులు పాల్గొన్నట్లు ఓ జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్లే.. టీటీడీ సభ్యుడైన కృష్ణమూర్తి వైద్యనాథన్ ఇటీవల కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ హోమం(రుద్ర జప హోమం) నిర్వహించారు. ఇందులో కృష్ణమూర్తి కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కూడా పాల్గొన్నారు. అయితే సాధారణంగా తిరుమలలో కేవలం బోర్డు ఆధ్వర్యంలోనే పూజలు నిర్వహిస్తుంటారు. తిరుమలలోనే కాదు, టీటీడీ బోర్డు పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లోనూ ఆ బోర్టు మాత్రమే హోమాలైనా నిర్వహిస్తుంటుంది. అలాంటిది ఓ టీటీడీ సభ్యుడు ప్రైవేట్‌గా హోమం చేయించడంతో కొత్త వివాదం మొదలైంది. ఇక ఈ హోమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అనుమతి కూడా లభించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ వివాదంపై టీటీడీ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం స్పందించారు. ఈ హోమంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక సాధారణ భక్తులకు ఇలాంటి ప్రైవేట్ హోమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు అందరికీ ఉండదు. కేవలం టీటీడీ పెద్దలకు మాత్రమే అని సమాధానం ఇచ్చారు. మరోవైపు దీనిపై స్పందించిన కృష్ణమూర్తి.. మానవాళి మొత్తం క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ హోమం నిర్వహించామని తెలిపారు. అయితే తన తల్లిదండ్రులకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణమూర్తి ఈ యాగం నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.