ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తుతున్న వర్షం.. పిడుగులు పడి 17 మంది మృతి..!
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న కురిసిన వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి 17 మంది మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికి దాదాపు 58 మంది మృతిచెందారు. భారీ వర్షం కారణంగా ఉద్యోగస్తులు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో సహాయక […]
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న కురిసిన వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి 17 మంది మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికి దాదాపు 58 మంది మృతిచెందారు. భారీ వర్షం కారణంగా ఉద్యోగస్తులు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.