Viral News: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన కుర్రాడు.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా..
కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ కుర్రాడి కడుపులో వైద్యులు ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకును గుర్తించారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్లోరీలోకి వెళ్లాల్సిందే. నేపాల్‌లోని ఖాఠ్మాండ్‌కు చెందిన ఓ 22 ఏళ్ల కుర్రాడు ఇటీవల కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుర్రాడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు అన్ని....

పొట్టలో చాకు ఉంచి మర్చిపోవడం, చేతి గ్లౌజ్‌లు అలాగే ఉంచేసి కుట్లు వేయడం లాంటివి చూసే ఉంటాం. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అడపాదడపా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ వైద్యుల పొరపాటు లేదా ఏమరపాటుతో జరుగుతుంటాయి. అయితే తాజాగా చోటుచేసుకున్న ఓ విచిత్ర సంఘటన అదరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ కుర్రాడి కడుపులో వైద్యులు ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకును గుర్తించారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్లోరీలోకి వెళ్లాల్సిందే. నేపాల్‌లోని ఖాఠ్మాండ్‌కు చెందిన ఓ 22 ఏళ్ల కుర్రాడు ఇటీవల కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుర్రాడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించినా ఏం తేలలేదు. కడుపునొప్పి ఉన్నా ఎలాంటి వికారం లాంటి లక్షణాలు కనిపించలేవు.
దీంతో అసలేం జరిగిందని పొట్ట భాగాన్ని పరిశీలిస్తుండగా పొట్ట కుడి భాగంలో కుట్లు వేసి ఉన్నట్లు వైద్యులు గుర్తించార. దీంతో అసలు ఇదేంటని ప్రశ్నించగా, ముందు రోజు ఓ గొడవ జరిగిందని, అందులో భాగంగానే ఈ గాయమైనట్లు చెప్పుకొచ్చాడా కుర్రాడు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌రే తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఆ కుర్రాడి పొట్టలో ఓ చాకు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు కనిపించగానే వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ చాకును పొట్టలో నుంచి తొలగించారు. పొట్టలో చాకు ఉండిపోవడం వల్లే నొప్పి వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే చాకు పొట్టలో మరోవైపునకు తిరిగినా.. పొట్ట భాగంలో ఏ అవయానికి గాయం కాకపోవడం అదృష్టంగా చెప్పొచ్చు. పొట్టలో పేగులకు ఏమాత్రం ప్రమాదం జరిగినా ప్రాణాలకే నష్టం వాటిల్లేదని వైద్యులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ముందు రోజు జరిగిన దాడిలో కుర్రాడి పొట్టలోకి చాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మద్యం మత్తులో ఉండడం, గాయం కూడా చిన్నగానే ఉండడంతో పెద్దగా అనుమానం రాలేదు. స్థానికంగా ఉన్న ఓ ఆరోగ్య కార్యకర్త చిన్న గాయమేకదాని కుట్లు వేసేశాడు. అయితే కడుపులో చాకు ఉండిపోయినట్లు మాత్రం గుర్తించలేకపోయాడు. దీంతో మరునాడు కడుపునొప్పి లేవడంతో అసలు విషయం బయటపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..