KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్.. విడుదలైన గంటల్లోనే..
కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

KGF2 teaser : కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఆల్రెడీ టీజర్ లీక్ అవడంతో కాస్త ముందుగానే అంటే గురువారం రాత్రి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో రెకార్డ్ లు తిరగరాస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది టీజర్. 12 గంటల వ్యవధిలోనే 17 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది ఈ టీజర్. మరోవైపు 2.3 మిలియన్ లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇక టీజర్ ఈ రేంజ్ లో ఉంటె ఇక ట్రైలర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు. కేజీఎఫ్ 1ను మించి పార్ట్ 2 ఉండనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తుంది. హీరోయిన్ రవీనా టాండన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండగా.. స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా గా కనిపించనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Tollywood Young Heroes: వేసవినే నమ్మకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. చిత్రాల విడుదలకు సన్నాహాలు..!