Butta-Bomma Song : రికార్డుల పరంపర కొనసాగిస్తున్న ‘అలవైకుంఠపురంలో’.. బుట్టబొమ్మ ఖాతాలో…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

Butta-Bomma Song : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంలో సంగీతం కీ రోల్ ప్లేచేసింది. థమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.
అన్ని పాటలు రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మరికొద్దిరోజుల్లో రానున్న సంక్రాంతికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అయినా రికార్డుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిదో తెలిసిందే. ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఈ సాంగ్ తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసి సంచలన రికార్డు సెట్ చేసింది. ఈ సాంగ్‌కు ఆదరణ రోజురోజుకు పెరుగుతూ పోతుండడం పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్.. విడుదల లైన గంటల్లోనే..