Renu Desai clarifies rumours : మహేష్ సినిమాలో నటించడంపై స్పందించిన రేణుదేశాయ్.. ఏమన్నారంటే
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో

Renu Desai clarifies rumours : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. సంక్రాంతి తరవాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాకు సంబంచిన ఓ రూమర్ గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..
సర్కారు వారి పాట సినిమాలో రేణుదేశాయ్ నటిస్తున్నారని, మహేష్ బాబు వదినగా రేణుదేశాయ్ కనిపించనున్నారని ప్రచారం జరిగింది. మహేష్ సినిమాలో రేణుదేశాయ్ అని వార్తలు రావడంతో అభిమానుల్లోకూడా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ వార్త పై రేణుదేశాయ్ స్పంచించారు.. తాను ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ‘నేను ఏ ప్రకటన చేయాలనుకున్నా నాకు సంబంధించిన సినిమా ఏదైనా కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇస్తాను. ఎప్పుడైతే నేను సమాచారం ఇస్తానో అప్పుడే నమ్మండి అంటూ చెప్పుకొచ్చారు ఆమె. దాంతో మహేష్ సినిమాలో రేణుదేశాయ్ నటిస్తున్నారన్న పుకారుకు పులిస్టాప్ పడింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్.. విడుదలైన గంటల్లోనే..
Butta-Bomma Song : రికార్డుల పరంపర కొనసాగిస్తున్న ‘అలవైకుంఠపురంలో’.. బుట్టబొమ్మ ఖాతాలో…