ఆత్మవిశ్వాసంతో బెంగళూరు, విజయమే లక్ష్యంగా రాజస్తాన్‌

కరోనా కాలంలో సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ లేక అల్లాడిపోతున్నవారికి ఐపీఎల్‌ బోడెలండ వినోదాన్ని పంచుతోంది.. సరిగ్గా రెండు వారాల కిందట మొదలైన ఐపీఎల్‌ ఇప్పుడే ఊపందుకుంది.. మ్యాచుల్లో పూర్తి మజాను ఆస్వాదిస్తున్నారు అభిమానులు.. ఈసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయినా టీవీల్లో చూసి ఆనందపడుతున్నారు.. ఆల్‌మోస్టాల్‌ మ్యాచ్‌లన్నీ ఆఖరి ఓవర్‌ వరకు టెన్షన్‌ పెడుతున్నవే కావడంతో ఆసక్తి మరింత పెరిగింది.. వీకెండ్‌ కాబట్టి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇవాళ డబుల్‌ ధమాఖ. ఎందుకంటే ఐపీఎల్‌లో ఈ రోజు రెండు మ్యాచ్‌లు.. […]

ఆత్మవిశ్వాసంతో బెంగళూరు, విజయమే లక్ష్యంగా రాజస్తాన్‌
Follow us
Balu

|

Updated on: Oct 03, 2020 | 11:18 AM

కరోనా కాలంలో సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ లేక అల్లాడిపోతున్నవారికి ఐపీఎల్‌ బోడెలండ వినోదాన్ని పంచుతోంది.. సరిగ్గా రెండు వారాల కిందట మొదలైన ఐపీఎల్‌ ఇప్పుడే ఊపందుకుంది.. మ్యాచుల్లో పూర్తి మజాను ఆస్వాదిస్తున్నారు అభిమానులు.. ఈసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయినా టీవీల్లో చూసి ఆనందపడుతున్నారు.. ఆల్‌మోస్టాల్‌ మ్యాచ్‌లన్నీ ఆఖరి ఓవర్‌ వరకు టెన్షన్‌ పెడుతున్నవే కావడంతో ఆసక్తి మరింత పెరిగింది.. వీకెండ్‌ కాబట్టి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇవాళ డబుల్‌ ధమాఖ. ఎందుకంటే ఐపీఎల్‌లో ఈ రోజు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం మూడున్నరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్థాన్‌ రాయల్స్ తలపడబోతున్నది.. అసలే ఎడారి దేశం.. ఆపై మధ్యాహ్నం.. మండుటెండలో మ్యాచ్‌లాటడమన్నది ఆటగాళ్లకు పెద్ద పరీక్షనే! మనకు మూడున్నరే కానీ.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో రెండు గంటలే! ఓ రకంగా మిట్ట మధ్యాహ్నమే! రాత్రుళ్లు జరుగుతున్న మ్యాచ్‌లకే ఆపసోపాలు పడుతున్న ఆటగాళ్లు ఎండలో ఎలా ఆడతారో! మంబాయితో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. ఆపై సూపర్‌ ఓవర్‌లో గెలుపొందిన బెంగళూరు సమరోత్సాహంతో బరిలో దిగబోతున్నది.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో వస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరును సాధించే అవకాశం ఉంటుంది.. మూడు మ్యాచులలో కోహ్లీ పాతిక పరుగులైనా చేయకపోవడం జట్టును కలవరపరుస్తోంది.. మొదటి మ్యాచ్‌లో మూడు పరుగులు, రెండో మ్యాచ్‌లో ఒక పరుగు, మూడో మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే కోహ్లీ చేయగలిగాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీకి ఇదో లెక్క కాదు.. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది.. ఫామ్‌లోకి వస్తే మాత్రం కోహ్లీని ఎవరూ ఆపలేరు.. కోహ్లీ మరో 82 పరుగులు చేస్తే టీ-20లలో చరిత్ర సృష్టించిన వాడవుతాడు.. ప్రస్తుతం 269 ఇన్నింగ్స్‌లో 8918 పరుగులు చేసిన కోహ్లీ తొమ్మిది వేల పరుగుల క్లబ్‌లో చేరతాడు..టీ-20లలో 9 వేల పరుగులు చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు.. అయిదు సెంచరీలు, 64 హాఫ్‌ సెంచరీలు చేసిన కోహ్లీకి 82 పరుగులు చేయడం పెద్ద సమస్య కాదు.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 180 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5430 పరుగులు చేశాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఎదురైన పరాభవం నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ ఇంకా బయటకు రాలేకపోతున్నది.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.. అంతకు ముందు జరిగిన రెండు మ్యాచులలో రెండు వందలకు పైగా స్కోరు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో మ్యాచ్‌లో మాత్రం 137 పరుగులే చేయగలిగింది.. చివరి మ్యాచ్‌లో కెప్టెన్‌ స్మిత్‌, సామ్సన్‌లు రాణించలేకపోయారు.. దాంతో మిడిల్‌ఆర్డర్‌పై పెను భారం పడింది.. స్మిత్‌ రాణిస్తే ఆర్‌ఆర్‌ మళ్లీ భారీ స్కోరు చేయగలుగుతుంది.. ఆల్‌రౌండర్లు తేవటియా.. ఆర్చర్‌లు బ్యాట్‌కు పని చెప్తే పరుగుల వరద పారే అవకాశం లేకపోలేదు..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మొహమ్మద్‌ సిరాజ్, షహబాజ్‌ అహ్మద్, పార్థివ్‌ పటేల్, యజువేంద్ర చహల్, నవదీప్‌ సైనీ, పవన్‌ నేగి, దేవ్‌దత్‌ పడిక్కల్, శివమ్‌ దూబే, ఉమేశ్‌ యాదవ్, గుర్‌కీరత్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, పవన్‌ దేశ్‌పాండే (భారత ఆటగాళ్లు). క్రిస్‌ మోరిస్, జోష్‌ ఫిలిప్, మొయిన్‌ అలీ, ఆరోన్‌ ఫించ్, ఏబీ డివిలియర్స్, ఇసురు ఉదాన, డేల్‌ స్టెయిన్, ఆడమ్‌ జంపా(విదేశీ ఆటగాళ్లు). రాజస్తాన్‌ రాయల్స్‌ స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్, ఆండ్రూ టై, ఒషాన్‌ థామస్, జోఫ్రా ఆర్చర్, డేవిడ్‌ మిల్లర్, జాస్‌ బట్లర్, టామ్‌ కరన్‌ (విదేశీ ఆటగాళ్లు). సంజు శామ్సన్, కార్తీక్‌ త్యాగి, అంకిత్‌ రాజ్‌పుత్, శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా, ఉనాద్కట్, మయాంక్‌ మర్కండే, మహిపాల్‌ లోమ్రోర్, రియాన్‌ పరాగ్, యశస్వి జైస్వాల్, అనూజ్‌ రావత్, ఆకాశ్‌ సింగ్, మనన్‌ వోహ్రా, శశాంక్‌ సింగ్, వరుణ్‌ ఆరోన్, రాబిన్‌ ఉతప్ప, అనిరుధ జోషి (భారత ఆటగాళ్లు)