ఢిల్లీ వెర్సస్ కోల్‌కతా.. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం!
ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. చివరి మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ కసితో ఉంది.
ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. చివరి మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ కసితో ఉంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలు మించి రాణిస్తోంది. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ధావన్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ఆల్‌రౌండర్ రూపంలో స్టోయినిస్, అక్షర్ పటేల్ చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇషాంత్ శర్మ, రబాడా, నోర్తజ్ లాంటి అద్భుత బౌలర్లు ఈ జట్టు సొంతం. అలాగే ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆడతాడా.? లేదా.? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. (IPL 2020)
కోల్‌కతా విషయానికి వస్తే.. ఓపెనర్ నరైన్, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీస్తోంది. యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్, ఇయాన్ మోర్గాన్ గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడం కలిసొచ్చే అంశం. యువ బౌలర్లు శివమ్ మావి, కమలేష్ నాగర్‌కోటి వికెట్లు పడగొట్టడం.. అలాగే ప్యాట్ కమ్మిన్స్ ఫామ్ అందుకోవడం కోల్‌కతాకు ప్లస్ పాయింట్. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.