మహేష్ పంచెకట్టు, కోరమీసం.. లుక్ అదుర్స్ బాసూ.!

సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ పరంగా కొంచెం కొత్తగా ట్రై చేశారు. కోరమీసం, పంచెకట్టుతో అచ్చం 'పెదరాయుడు'లా ఫ్యాన్స్‌కు దర్శనం ఇచ్చారు.

మహేష్ పంచెకట్టు, కోరమీసం.. లుక్ అదుర్స్ బాసూ.!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 03, 2020 | 12:27 PM

Mahesh Babu Flipkart AD: సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ పరంగా కొంచెం కొత్తగా ట్రై చేశారు. కోరమీసం, పంచెకట్టుతో అచ్చం ‘పెదరాయుడు’లా ఫ్యాన్స్‌కు దర్శనం ఇచ్చారు. ఈ లుక్ చూసిన అభిమానులు అదుర్స్ అని అంటున్నారు. అసలు లాక్‌డౌన్‌లో సినిమాలు రిలీజ్ కాలేదు. మరి ఈ లుక్ ఏంటని అనుకుంటున్నారా.? ఇదొక యాడ్‌కు సంబంధించిన లుక్ అండి. ఇందులో మహేష్ బాబు డబుల్ రోల్‌లో ప్రేక్షకులను అలరించారు.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’కు సంబంధించిన ఓ యాడ్‌ను మహేష్‌పై చిత్రీకరించారు. ఇందులో సూపర్ స్టార్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. ఈ యాడ్‌లో ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిలియన్ డేస్‌’ గురించి అన్నయ్య.. తమ్ముడికి వివరిస్తాడు. పంచెకట్టు, కోరమీసంతో అన్నయ్యగా మహేష్ బాబు లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.