ఐపీఎల్ 2020 విన్నర్ ఎవరో చెప్పేసిన క్రికెట్ దిగ్గజం

ఐపీఎల్ 2020 విన్నర్ గా ఎవరు నిలుస్తారన్నది క్రీడాభిమానుల్లో ప్రస్తుతం అతిపెద్ద ఊహాగానం. వారంరోజుల్లో దుబాయ్ వేదికగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగబోతోంది. ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్..

ఐపీఎల్ 2020 విన్నర్ ఎవరో చెప్పేసిన క్రికెట్ దిగ్గజం
Follow us

|

Updated on: Sep 11, 2020 | 1:14 PM

ఐపీఎల్ 2020 విన్నర్ గా ఎవరు నిలుస్తారన్నది క్రీడాభిమానుల్లో ప్రస్తుతం అతిపెద్ద ఊహాగానం. వారంరోజుల్లో దుబాయ్ వేదికగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగబోతోంది. ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీ ఎవరి వశమవుతుందన్న దానిపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పారు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్సే 13వ సీజన్ కప్ ను ఎగరేసుకుపోతుందని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా బ్రెట్ లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇలాఉంటే, ఇటీవలి కాలంలో సీఎస్కే జట్టు తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. టీమ్ లో 13 మంది కరోనా బారిన పడటం, ఆపై కుటుంబ కారణాలతో సురేశ్ రైనా టోర్నీకి దూరమైన సంగతి విదితమే, ఆ వెంటనే హర్భజన్ సైతం ఈ సీజన్ ఆడటం లేదని ప్రకటించారు. అయినప్పటికీ, సీఎస్కే మేనేజ్ మెంట్.. తమ జట్టు చాలా బలంగా ఉందంటోంది. మూడు సార్లు తన ఫ్రాంచైజీకి ఐపీఎల్ ట్రోఫీని అందించిన ధోనీ అనుభవం, ఈసారి కూడా ఉపకరిస్తుందని మేనేజ్ మెంట్ తోపాటు, సీఎస్కే ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఐపీఎల్ కవరేజ్ నిమిత్తం ఇప్పటికే ముంబైకి చేరుకున్న బ్రెట్ లీ, కొవిడ్ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నాడు.

Latest Articles
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
నల్లని పుట్టుమచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
నల్లని పుట్టుమచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..