రైనా స్థానంలో చెన్నై టీమ్ లోకి ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్..!
చెన్నై జట్టుకు పెద్ద దిక్కుగా ఉన్న సురేష్ రైనా అనుహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టు ఫ్రాంచైజీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
కరోనా కష్టకాలంలో ఐపీఎల్ జరుగుతుందా, లేదా అనుకున్న సమయంలో దుబాయ్ లో సెప్టెంబర్ 19న క్రికెట్ పండుగ ఫ్లాన్ చేసింది బీసీసీఐ. అయితే చెన్నై జట్టుకు పెద్ద దిక్కుగా ఉన్న సురేష్ రైనా అనుహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టు ఫ్రాంచైజీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అల్ రౌండర్ గా జట్టుకు సేవలందించిన రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు యత్నిస్తున్నారు. సురేశ్ రైనా టీమ్ నుంచి తప్పుకుని దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. అతడి స్థానాన్ని భర్తీ చేయని చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు జట్టు యాజమాన్యం మలన్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో పరుగుల వరద పారించిన మలన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానానికి దూసుకెళ్లాడు. మలన్ గనక జట్టుల్ చేరితే చెన్నై సూపర్ కింగ్స్ రైనా లేని చోటును పూడ్చినట్లవుతుందని టీమ్ యాజమాన్యం భావిస్తుంది.