కంగనా రనౌత్ తల్లి ఆశాను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ
శివసేనపై దుమ్మెత్తిపోస్తున్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వెనకాల కాషాయదళం అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేకపోలేదని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
శివసేనపై దుమ్మెత్తిపోస్తున్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వెనకాల కాషాయదళం అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేకపోలేదని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.. తన కూతురుకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినందుకు కంగనా రనౌత్ తల్లి ఆశా రనౌత్ బీజేపీకి కృతజ్ఞతలు తెలపడాన్ని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ నాయకత్వం స్వాగతిస్తోంది… ఆశా రనౌత్‌ను బీజేపీలోకి ఆహ్వానించింది.. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉంటే బీజేపీలో చేరవచ్చని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ చీఫ్ సురేష్‌కుమార్ కాశ్యప్ తెలిపారు.. నిజానికి ఆశా రనౌత్ అధికారికంగా బీజేపీలో చేరకపోయినా ఆమె ఆ పార్టీకి గట్టి సపోర్టర్.
ఒకప్పుడు రనౌత్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయత కనబర్చిందని, ఇప్పుడు మాత్రం బీజేపీకు మద్దతునిస్తున్నదని కాశ్యప్ చెప్పుకొచ్చారు. ఆశా రనౌత్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, ఆమెను పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారని, తన కూతురు యోగక్షేమాలను పట్టించుకుంటున్నందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారని కాశ్యప్ అన్నారు. కంగనా రనౌత్ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని తెలిపారు కాశ్యప్.. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు కూడా ముద్దాయిలేనన్నారు.. భారతదేశపు ముద్దు బిడ్డ, సాహసి కంగనా వెనుకాల దేశం యావత్తు నిలుస్తుందని చెప్పారు. ఇంతకు ముందు తాము కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులమే అయినా ఇప్పుడు బీజేపీ పట్ల అభిమానం పెరిగిందని ఆశా రనౌత్ చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి కంగానకు పరోక్షంగా మద్దతు ఉందని!