మీ చేతి వేళ్లు మీరేంటో చెబుతాయి.. వేళ్ల సైజ్‌తో తెలుసుకోవచ్చు..
అయితే ఒక వ్యక్తి తెలివైనవాడా లేదా అన్న విషయాలు వారి చేతి వేళ్ల ఆధారంగా తెసుకోవచ్చని చెబుతున్నారు. హస్తరేఖ నిపుణులు పలు విషయాలను శాస్త్రంలో పేర్కొన్నారు. చేతికి ఉండే వేళ్ల ఆధారంగా సదరు వ్యక్తిత్వం ఏంటి.? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది.? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటురానే విషయాలను వెల్లడించారు...

ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. ఏ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకలా ఉండవు. అలాగే వారి తెలివితేటలు కూడా భిన్నంగా ఉంటాయి. వ్యక్తుల తెలివితేటలను ఐక్యూ ఆధారంగా లెక్కిస్తారు. అయితే ఒక వ్యక్తి తెలివైనవాడా లేదా అన్న విషయాలు వారి చేతి వేళ్ల ఆధారంగా తెసుకోవచ్చని చెబుతున్నారు. హస్తరేఖ నిపుణులు పలు విషయాలను శాస్త్రంలో పేర్కొన్నారు. చేతికి ఉండే వేళ్ల ఆధారంగా సదరు వ్యక్తిత్వం ఏంటి.? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది.? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటురానే విషయాలను వెల్లడించారు. ఇంతకీ చేతి వేళ్ల ఎలా ఉంటే.. వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఒకవేళ మీ ఎడమ చేతి ఉంగరపు వేలు పొడువుగా ఉండి, చూపుడు వేలు పొట్టిగా ఉంటే మీరు తెలివైన వారని అర్థం. ఇలాంటి వ్యక్తులు సంక్షోభంలో అద్భుత నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను పరిష్కరించడంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఇలాంటి వ్యక్తులు మంచి ఐక్యూని కలిగి ఉంటారు. ఎంతటి ఒత్తిడిలోనైనా పజిల్స్‌ను సాల్వ్ చేయగలరు.
* ఉంగరపు వేలు చిన్నగా ఉండి చూపుడు వేళు పొడవుగా ఉంటే. సదరు వ్యక్తులు ఆత్మ విశ్వాసంతో ఉంటారని అర్థం. ఇలాంటి వారు తాము చేసే పనిలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు. ఇలాంటి వారు తాము చేసే పనుల గర్వంగా ఉంటారు. ప్రతీ పనిలో తమ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కోరికతో ఉంటారు.
* ఉంగరపు వేలు, చూపుడు వేలు రెండూ సమానంగా ఉంటే.. అలాంటి వ్యక్తులు శాంతి, ప్రేమగల స్వభావంతో ఉంటారు. ప్రణాళికబద్ధంగా ఉంటారు. ఇలాంటి వారు పోరాటాలు చేయడానికి ఇష్టపడరు. వీరు అందరితో బాగా కలిసిపోతారు, టీమ వర్క్‌లో అద్భుతమైన పనితీరును కనబరుస్తారు. వీరు తమ భాగస్వామికి ఎల్లప్పుడూ సపోర్ట్‌ను అందిస్తారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
