AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharaja express: ఈ రైలు టికెట్ ధర రూ. 20 లక్షలు.. మరెక్కడో కాదు మన దేశంలోనే..

ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు టికెట్‌గా పేరుగాంచిన రైలుగా మహారాజా ఎక్స్‌ప్రెస్ పేరు గాంచింది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఎక్కువగా విదేశీ యాత్రికులు ఈ రైల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రైలు ఇంటీరియర్‌ ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఇందులో ప్రయాణించే వారికి...

Maharaja express: ఈ రైలు టికెట్ ధర రూ. 20 లక్షలు.. మరెక్కడో కాదు మన దేశంలోనే..
Maharaja Express
Narender Vaitla
|

Updated on: Oct 04, 2024 | 4:43 PM

Share

మీకు తెలిసి రైలు టికెట్ ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 10 వేలు ఉంటుంది అంటారు కదూ! అయితే రైలు టికెట్ ధర అక్షరాల రూ. 20 లక్షలు. అవును రైలు టికెట్‌ ధర అక్షరాల రూ. 20 లక్షలు. అయితే ఈ రైలు ఎక్కడో విదేశాల్లో ఉందనుకునే మన దేశంలోనే అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ రైలు ప్రత్యేకత ఏంటి.? టికెట్‌ ధర అంతలా ఉండేందుకు కారణం ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు టికెట్‌గా పేరుగాంచిన రైలుగా మహారాజా ఎక్స్‌ప్రెస్ పేరు గాంచింది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఎక్కువగా విదేశీ యాత్రికులు ఈ రైల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రైలు ఇంటీరియర్‌ ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఇందులో ప్రయాణించే వారికి వెండి పాత్రల్లో ఆహారాన్ని అందిస్తారు. ముఖ్యంగా ఈ రైలులో ఉండే ప్రెసిడెన్షియల్ సూట్‌ అత్యంత లగ్జరీగా ఉంటుంది.

అందుకే ప్రెసిడెన్షియల్ సూట్‌ ధర అక్షరాల రూ. 20 లక్షలు కావడం విశేషం. అధునాతన సౌకర్యాలు ఈ రైలు ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఈ రైలు టికెట్ తీసుకుంటే మొత్తం 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ సేవలతో పాటు తాజ్‌ మహల్‌, ఖజురహో, రణతంబోర్‌ మీదుగా దేశంలోని పలు పర్యాటక ప్రదేశాల మీదుగా సాగుతోంది. ఫతేపూర్ సిక్రితో పాటు వారణాసి వంటి పర్యాటక ప్రదేశాలు కవర్‌ అవుతాయి.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలులో ప్రతీ కోచ్‌లో షవర్‌లతో కూడిన బాత్‌రూమ్‌లు, రెండు మాస్టర్‌ బెడ్ రూమ్‌లు అందిస్తారు. దీంతో కుటుంబంతో కలిసి ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ రైలులో ప్రతీ కోచ్‌లో మినీ బార్‌ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనంగా లైవ్‌ టీవీ, ఎయిర్‌ కండీషనర్‌, బయట ప్రదేశాలు చూడ్డానికి పెద్ద గ్లాస్‌ విండోలను అందించారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్