Dehati Rasgulla: త్రివేణీ సంగమం ప్రయాగ్‌రాజ్‌లో వెరీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. దేహతి రసగుల్లా విదేశీయులు సైతం రుచి చూడాల్సిందే..
రామ్ స్వరూప్ యాదవ్ 39 ఏళ్ల క్రితం పాల వ్యాపారం చేసే సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని బైరాహ్నా ప్రాంతంలో చిన్న స్వీట్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ షాపులో చేసిన రసగుల్లా రుచి ప్రజల ప్రశంసలు అందుకుంది. తక్కువ తీపి, స్వచ్ఛత, మృదుత్వం కారణంగా దీని రుచికి ప్రజలు అభిమానులయ్యారు. క్రమంగా తన దుకాణంలో ఉన్న రసగుల్లాకు ఆదరణ పెరగడం చూసి మిగిలిన స్వీట్లు తయారు చేయడం మానేశాడు. పూర్తిగా రసగుల్లా తయారీపై మాత్రమే దృష్టి పెట్టాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, విద్యా కేంద్రంగా మాత్రమే కాదు.. ఈ నగరం పాల పదార్ధాల రుచి ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంది. ఇక్కడ పాలుతో తయారు చేసే రకరకాల ఆహర పదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి. వీటి పేరు చెప్పగానే ఎవరికైనా నోటిలో నీళ్లు వస్తాయి. ఇక్కడి నేత్రంలోని కమ్మని, కారంగా ఉండే కచోరీని తిన్న తర్వాత నోటిని తీపి చేసుకోవాలనిపిస్తే రసగుల్లా రుచి ఆహా అనిపిస్తుంది. నగరంలోని ప్రయాగ్‌రాజ్, లోక్‌నాథ్, బైరాహానా ప్రాంతంలోని మిఠాయిలను ఇష్టపడే వారికి ఇష్టమైన ప్రదేశాలు. లోక్‌నాథ్ .. రబ్డీ లస్సీకి ట్రేడ్‌మార్క్‌గా మారితే.. రస్‌గుల్లాకు బైరానా మొహల్లా ట్రేడ్‌మార్క్‌గా మారింది. గత 39 ఏళ్లగా ఓ రసగుల్లా దుకాణంలో సాయంత్రం వేళల్లో రసగుల్లా తినాలంటే క్యూలో నిల్చుకుని ఎదురు చూడాల్సిందే.. దీని రుచి అంతగా ఆకట్టుకుంటుంది మరి. అంతగా కస్టమర్స్ ను ఆకట్టుకున్న రసగుల్లా షాప్ యజమాని గురించి ఈ రోజు తెలుసుకుందాం..
దేహతి రస్‌గుల్లా
రామ్ స్వరూప్ యాదవ్ 39 ఏళ్ల క్రితం పాల వ్యాపారం చేసే సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని బైరాహ్నా ప్రాంతంలో చిన్న స్వీట్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ షాపులో చేసిన రసగుల్లా రుచి ప్రజల ప్రశంసలు అందుకుంది. తక్కువ తీపి, స్వచ్ఛత, మృదుత్వం కారణంగా దీని రుచికి ప్రజలు అభిమానులయ్యారు. క్రమంగా తన దుకాణంలో ఉన్న రసగుల్లాకు ఆదరణ పెరగడం చూసి మిగిలిన స్వీట్లు తయారు చేయడం మానేశాడు. పూర్తిగా రసగుల్లా తయారీపై మాత్రమే దృష్టి పెట్టాడు.
కొన్ని రోజులకే రామ్ స్వరూప్ దుకాణంలో రసగుల్లాకు డిమాండ్ పెరగడం మొదలైంది. క్రమంగా అమ్మకాలు పెరిగాయి. అయితే రామ్ స్వరూప్ దుకాణంలోని రసగుల్లాకు ఒక గుర్తింపు అవసరం. రామ్ స్వరూప్ యాదవ్ తనయుడు అజయ్ యాదవ్ తన తండ్రి ముద్దు పేరు దేహతి పేరుగా రసగుల్లాకు దేహతి అనే పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో గ్రామీణ రసగుల్లా బ్రాండ్‌గా మారింది.
వాస్తవానికి, రసగుల్లా తయారీకి 3 వస్తువులను ఉపయోగిస్తారు. కోవా, చక్కెర, పిండి. ఈ మూడు వస్తువులను కలపడం.. తయారీ విధానం వెరీ వెరీ స్పెషల్. రామ్ స్వరూప్ రసగుల్లా తయారీ చేయడానికి ఉపయోగించే మెటీరియల్ విషయంలో రాజీపడడు. కోవాను స్వయంగా తయారు చేస్తాడు. లేదా బాగా నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర కోవాను కొనుగోలు చేస్తారు. ఇందుకు ముందు కోవా టెస్ట్ పరీక్షిస్తారు కూడా.. రసగుల్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయెందుకు 1 కిలోల కోవాలో 150 గ్రాముల పిండిని మాత్రమే కలుపుతామని చెప్పారు.
దేహతి రసగుల్లా టర్నోవర్ 75 లక్షలు
షాప్‌కీపర్ అమిత్ మాట్లాడుతూ.. మేము దీనిని రూ. 1తో ప్రారంభించామని అయితే కాలక్రమంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. పాల ధరలు పెరగడంతో రసగుల్లా రేట్లు కూడా పెంచవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు ఒక పెద్ద రసగుల్లా ధర రూ.20. సాధారణ రసగుల్లాలతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. రోజుకు దాదాపు 3 నుంచి 4 వేల వరకు రసగుల్లాలు విక్రయిస్తున్నారు. దేహతి రసగుల్లా వార్షిక టర్నోవర్ దాదాపు రూ.75 లక్షలు.
విదేశీ పర్యాటకులు ఇష్టపడే రసగుల్లా
ఇక్కడ రసగుల్లాను ఇతర నగరాల పర్యాటకులే కాదు, విదేశీ పర్యాటకులు కూడా అమితంగా ఇష్టంగా తింటారు. రామ్ ప్రసాద్ దుకాణం నగరంలోని నాగరిక ప్రాంతం నుండి సంగం ప్రాంతానికి సమీపంలో ఉంది. అయినా సరే విదేశాల నుండి వచ్చే పర్యాటకులను సైతం ఆకర్షిస్తుంది. కుంభమేళా లేదా మాఘమేళాకు వచ్చే యాత్రికుడు రసగుల్లా రుచి చూడకుండా వెళ్ళనే వెళ్ళడు. థాయిలాండ్, కెనడా, బ్రిటన్, నేపాల్, పోలాండ్ దేశాల నుంచి పర్యాటకులు తరచూ వస్తుంటారు. ఈసారి మహా కుంభమేళాలో రసగుల్లా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని.. భక్తులు, పర్యాటకుల రసగుల్లా రుచి చూసే విధంగా చేస్తామని చెప్పారు దుకాణం యజమాని.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..