Multibagger Stock: దీనిలో పెట్టుబడి పెడితే లాభాల పంటే.. ఐదేళ్లలో ఊహకందని లాభాలు..

కొన్ని స్టాక్ లు మాత్రం తక్కు వ సమయంలో అధిక రాబడిని అందిస్తాయి. వీటి వ్యాల్యూ ఏటా పెరిగిపోతూనే ఉంటుంది. మీ పెట్టుబడికి అనేక రెట్ల రాబడిని తీసుకువస్తాయి. వీటినే మల్టీ బ్యాగర్ స్టాక్‌లు అంటారు. ప్రస్తుతం ఏపీఎల్ అపోలో ట్యూబ్ లిమిటెడ్ షేర్లు అత్యధిక లాభాలు అందిస్తున్నాయి. వాటి విలువ రూ.136 నుంచి 1,620కి పెరిగింది. ఈ స్టాక్ ఐదేళ్లలో విపరీతమైన లాభాలను తెచ్చింది.

Multibagger Stock: దీనిలో పెట్టుబడి పెడితే లాభాల పంటే.. ఐదేళ్లలో ఊహకందని లాభాలు..
Stock Market
Follow us
Madhu

|

Updated on: Oct 04, 2024 | 4:54 PM

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని, అధిక ఆదాయం పొందాలనునేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టేవారు కొంచెం రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే కొన్ని స్టాక్ లు మాత్రం తక్కు వ సమయంలో అధిక రాబడిని అందిస్తాయి. వీటి వ్యాల్యూ ఏటా పెరిగిపోతూనే ఉంటుంది. మీ పెట్టుబడికి అనేక రెట్ల రాబడిని తీసుకువస్తాయి. వీటినే మల్టీ బ్యాగర్ స్టాక్‌లు అంటారు. ప్రస్తుతం ఏపీఎల్ అపోలో ట్యూబ్ లిమిటెడ్ షేర్లు అత్యధిక లాభాలు అందిస్తున్నాయి. వాటి విలువ రూ.136 నుంచి 1,620కి పెరిగింది. ఈ స్టాక్ ఐదేళ్లలో విపరీతమైన లాభాలను తెచ్చింది.

కంపెనీ వివరాలు..

ఏపీఎల్ అపోలో ట్యూబ్ లిమిటెడ్ అనేది స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్ లను ఉత్పత్తి చేస్తే అతి పెద్ద కంపెనీ. దీనికి దేశంలోని 29 నగరాల్లో గోడౌన్లు, బ్రాంచ్ కార్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీకి ఈ సంస్థ ద్వారా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. సుమారు 1100 రకాల ప్రి- గాల్వనైజ్డ్ ట్యూబులు, స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్ లు, ఎంఎస్ బ్లాక్ పైపులు, హాలో సెక్షన్లను ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని ప్రముఖ స్టీల్ ఉత్పత్తుల సంస్థలలో ఇది ఒకటి.

లాభాల దూకుడు..

అపోల్ ట్యూబ్స్ లిమిటెడ్ షేర్ల ఐదేళ్లలో విపరీతమైన లాభాలను ఆర్జించాయి. దాదాపు 1,090 శాతం రాబడిని తీసుకువచ్చాయి. 2019 అక్టోబర్ 1వ తేదీన రూ.136తో వీటి స్టాక్ ముగిసింది. ఈ క్రమంలో మంగళవారానికి వాటి రూ.1620కి పెరిగింది. అంటే ఐదేళ్లలో షేర్ విలువ రూ.136 నుంచి రూ.1620కి చేరింది. బీఎస్ఈలో ముగిపటి ముగింపు రూ.1,584తో పోల్చితే అక్టోబర్ ఒకటిన 2.26 శాతం లాభంతో రూ.1619.80 వద్ద ముగిసింది. గతేడాది అక్టోబర్ 18న రూ.1789కి చేరి ఆల్ టైమ్ రికార్డు సాధించింది.

టర్నోవర్..

ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టాక్ ఈ ఏడాది 6.18 శాతం లాభపడింది. ఈ సంస్థకు చెందిన షేర్లు అనేక చేతులు మారాయి. బీఎస్ఈలో రూ.5.24 కోట్లకు టర్నోవర్ చేరుకుంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.44,953 కోట్లకు పెరిగింది. దీని సాపేక్ష బలం సూచిన (ఆర్ ఎస్ఐ) 74.5 వద్ద ఉంది. ఓవర్ బాట్ జోన్ లో ట్రేడింగ్ అవుతున్నట్టు ఇది సూచిస్తుంది.

ఇబ్బందులు ఇవే..

ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టాక్ దూకుడు కొనసాగుతునప్పటికీ, దానికి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్ లో పరిస్థితులు దాన్ని ప్రభావితం చేస్తాయి.

  • జీడీపీ రేటులో మందగమనం ఏర్పడితే ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా నిర్మాణం, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలపై దీని ప్రభావం పడుతుంది. దీని వల్ల ఉక్కు పైపుల డిమాండ్ తగ్గిపోవచ్చు.
  • పైపుల తయారికీ హెచ్ ఆర్ కాయిల్ చాలా కీలకమైన ముడిపదార్థం. దాని ధరలో పెరుగుదల జరిగితే ఏపీఏటీ మార్జిన్లకు దెబ్బతీస్తుంది. ఉక్కు ధరలు తగ్గిపోయినా కూడా ఇబ్బందులు కలుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!