Ola BOSS Sale: రూ. 50వేలకే ఓలా స్కూటర్.. అదిరింది ‘బాస్’ ఈ ఆఫర్..

దసరా పండుగ సీజన్ లో అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్(BOSS)ను ను ప్రారంభించింది. ఈ సేల్లో తన ఓలా స్కూటర్ పోర్ట్ ఫోలియోలోని ప్రముఖ మోడల్ ఎస్1 ఎక్స్ స్కూటర్ కేవలం రూ. 49,999కే అందిస్తున్నట్ల ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ మూడో తేదీ నుంచి ఆరంభించింది. అయితే ఇది కేవలం పరిమిత కాలం, పరిమితి యూనిట్లు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Ola BOSS Sale: రూ. 50వేలకే ఓలా స్కూటర్.. అదిరింది ‘బాస్’ ఈ ఆఫర్..
Ola S1x Electric Scooter
Follow us

|

Updated on: Oct 04, 2024 | 5:56 PM

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో టాప్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్. ఇక్కడ అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్ కూడా ఇదే. అయితే ఇటీవల కొన్ని చోట్ల ఈ స్కూటర్ల పనితీరుపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. దీంతో ఆ కంపెనీ స్కూటర్ల సేల్స్ కూడా కాస్త తగ్గినట్లే కనిపించాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ తిరిగి మార్కెట్లో నిలబడేందుకు ఓలా తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా దసరా పండుగ సీజన్ లో అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్(BOSS)ను ను ప్రారంభించింది. ఈ సేల్లో తన ఓలా స్కూటర్ పోర్ట్ ఫోలియోలోని ప్రముఖ మోడల్ ఎస్1 ఎక్స్ స్కూటర్ కేవలం రూ. 49,999కే అందిస్తున్నట్ల ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ మూడో తేదీ నుంచి ఆరంభించింది. అయితే ఇది కేవలం పరిమిత కాలం, పరిమితి యూనిట్లు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇంకా హైపర్ చార్జింగ్ క్రెడిట్స్, మూవ్ ఓఎస్ ప్లస్ అప్ గ్రేడ్, యాక్సెసరీస్ లపై డీల్స్ వంటివి దాదాపు రూ. 40వేల విలువైన ప్రయోజనాలను పండుగ ఆఫర్ కింద వినియోగదారులకు అందిస్తోంది. ఇప్పటి వరకూ ఓలా నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లలో ఇదే అత్యుత్తమమైనదని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ అండ్ ఎండీ భవిష్ అగర్వాల్ అన్నారు. ఈ సేల్ ను దసరా సందర్భంగా తీసుకురావడం మరింత ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు.

ఆఫర్ వివరాలు ఇవి..

ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ పై ‘బాస్’ సేల్ అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ రెండు కిలోవాట్ అవర్ బ్యారీ సామర్థ్యంతో ఉంటుంది. దీనిని కేవలం రూ. 49,999కే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే పరిమిత కాలం వరకూ అందుబాటులో ఉంచుతుంది. దీనిలో బ్యాటరీపై రూ. 25వేల డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకా ఎస్1 పోర్ట్ ఫోలియోపై రూ. 15వేల వరకూ క్యాష్ బ్యాక్, రూ. 7వేల విలువైన 8ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కూడా ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాక ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ. 5వేల వరకూ తగ్గింపు కూడా అందిస్తోంది. అలాగే రూ. 6వేల విలువైన మూవ్ ఓఎస్ ప్లస్ అప్ గ్రేడ్, రూ. 7వేలు విలువైన హైపర్ చార్జింగ్ క్రెడిట్స్ కూడా ఉచితంగా అందించనుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఓలా ఎస్1 పోర్ట్ ఫోలియోలో పలు రకాల స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. ఎస్1 ప్రో రూ. 1.3లక్షలు, ఎస్1 ఎయిర్ రూ. 1.07 లక్షలకు అందుబాటులో ఉన్నాయి.

విస్తరణకు యోచన..

గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా తన విక్రయాలు, సేవా నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతో నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2025 చివరి నాటికి ఓలా నెట్‌వర్క్‌ను 10,000కి పెంచాలని యోచిస్తోంది. అదనంగా భారతదేశంలోని ప్రతి మెకానిక్‌ని ఈవీ-రెడీగా చేసేందుకు 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..