Hyundai Motors IPO: ఐపీఓ బాటలో ప్రముఖ మోటర్ కంపెనీ.. పెట్టుబడి టార్గెట్ ఎంతంటే..?

ఇటీవల కాలంలో చాలా కంపెనీలు తమ మార్కెట్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి కోసం ఐపీఓల బాట పడుతున్నాయి. తాజాగా ప్రముఖ మోటర్ కంపెనీ అయిన హ్యూందాయ్ మోటర్స్ కూడా ఐపీఓ బాట పట్టింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అక్టోబర్ 14న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుస్తారు. ఈ ఇష్యూకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ వచ్చే వారం మధ్యలో ప్రకటిస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Hyundai Motors IPO: ఐపీఓ బాటలో ప్రముఖ మోటర్ కంపెనీ.. పెట్టుబడి టార్గెట్ ఎంతంటే..?
Ipos
Follow us

|

Updated on: Oct 04, 2024 | 4:45 PM

ఇటీవల కాలంలో చాలా కంపెనీలు తమ మార్కెట్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి కోసం ఐపీఓల బాట పడుతున్నాయి. తాజాగా ప్రముఖ మోటర్ కంపెనీ అయిన హ్యూందాయ్ మోటర్స్ కూడా ఐపీఓ బాట పట్టింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అక్టోబర్ 14న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుస్తారు. ఈ ఇష్యూకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ వచ్చే వారం మధ్యలో ప్రకటిస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఐపీఓ పత్రాలను క్లియర్ చేసింది. కంపెనీ 142,194,700 ఈక్విటీ షేర్‌ల వరకు ఐపీఓను ప్రారంభించాలని యోచిస్తోంది. ఓ ఐపీఓ  రూ.10గా ఉండనుంది. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ మోటర్స్ ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హ్యుందాయ్ ఇండియా ఐపీఓ సంభావ్య విలువ సుమారు రూ.25,000 కోట్లు (దాదాపు 3 బిలియన్ల డాలర్లు) ఉండవచ్చని అంచనా. గతంలోనే కంపెనీ అక్టోబర్ మొదటి 15 రోజుల్లో దీనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ ఐపీఓ విజయవంతమైతే దాదాపు 2.45 బిలియన్‌ల డార్లను సేకరిస్తే భారత జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) పేరిట ఉన్న ప్రస్తుత రికార్డును ఐపీఓ అధిగమిస్తుంది. రాబోయే పబ్లిక్ ఆఫర్ పూర్తిగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రమోటర్, సెల్లింగ్ షేర్ హోల్డర్ ద్వారా ఆఫర్ ఫర్ సేల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐపీఓ పూర్తయిన తర్వాత ఆఫర్ చేసిన షేర్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా యొక్క మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 17.50 శాతం ప్రాతినిధ్యం వహిస్తాయి.

అలాగే జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్‌లో ఎండీ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ ప్రకారం హ్యుందాయ్ ఐపీఓ దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి బలమైన ఆసక్తిని పొందుతుందని చెబుతున్నారు. భారతీయ మార్కెట్లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌లు, బ్లాక్ డీల్స్‌తో సహా ప్రతి కొత్త పేపర్‌కు భారీ డిమాండ్‌ని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. హ్యుందాయ్ దీనికి మినహాయింపు కాదని భావిస్తున్నట్లు వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఓ బాటలో ప్రముఖ మోటర్ కంపెనీ.. పెట్టుబడి టార్గెట్ ఎంతంటే..?
ఐపీఓ బాటలో ప్రముఖ మోటర్ కంపెనీ.. పెట్టుబడి టార్గెట్ ఎంతంటే..?
ఈ రైలు టికెట్ ధర రూ. 20 లక్షలు.. మరెక్కడో కాదు మన దేశంలోనే..
ఈ రైలు టికెట్ ధర రూ. 20 లక్షలు.. మరెక్కడో కాదు మన దేశంలోనే..
మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్‌ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్
మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్‌ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్
భారత్, బంగ్లా టీ20 సిరీస్‌కి రంగం సిద్ధం.. ఫ్రీగా ఇలా చూడండి
భారత్, బంగ్లా టీ20 సిరీస్‌కి రంగం సిద్ధం.. ఫ్రీగా ఇలా చూడండి
అధిక రాబడినిచ్చే ‘కొత్త ఫండ్ ఆఫర్’.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక..
అధిక రాబడినిచ్చే ‘కొత్త ఫండ్ ఆఫర్’.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక..
బిక్షాటన నుంచి డాక్టర్ గా మారిన యువతి .. సక్సెస్ స్టోరీ
బిక్షాటన నుంచి డాక్టర్ గా మారిన యువతి .. సక్సెస్ స్టోరీ
హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు టిప్స్ పాటించాల్సిందే..!
హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు టిప్స్ పాటించాల్సిందే..!
'స్వాగ్' సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నట విశ్వరూపం..
'స్వాగ్' సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నట విశ్వరూపం..
బిగ్ బాస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. జాబితా ఇదిగో
బిగ్ బాస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. జాబితా ఇదిగో
బంగారు పాలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ సీజన్‌కి బెస్ట్!
బంగారు పాలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ సీజన్‌కి బెస్ట్!