OnePlus,Oppo: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు షాకింగ్‌.. వన్‌ప్లస్‌, ఒప్పో ఫోన్‌లపై నిషేధం

వన్‌ప్లస్‌ (OnePlus), ఒప్పో (Oppo) బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను నిషేధించింది. ఈ నిషేధానికి కారణం పేటెంట్ దొంగతనం కేసు. వైర్‌లెస్ టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఇంటర్‌డిజిటల్ ప్రకారం, ఒప్పో, వన్‌ప్లస్ అనుమతి లేకుండా 5జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి..

OnePlus,Oppo: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు షాకింగ్‌.. వన్‌ప్లస్‌, ఒప్పో ఫోన్‌లపై నిషేధం
Mobiles
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2024 | 11:18 AM

వన్‌ప్లస్‌ (OnePlus), ఒప్పో (Oppo) బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను జర్మనీ నిషేధించింది. ఈ నిషేధానికి కారణం పేటెంట్ దొంగతనం కేసు. వైర్‌లెస్ టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఇంటర్‌డిజిటల్ ప్రకారం, ఒప్పో, వన్‌ప్లస్ అనుమతి లేకుండా 5జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

OnePlus నిషేధించడం ఇదే మొదటిసారి కాదు:

వన్‌ ప్లస్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. సుమారు 2 సంవత్సరాల క్రితం వన్‌ప్లస్‌ ఇదే కేసులో నోకియా పేటెంట్‌ను హక్కులను దొంగిలించిందని ఆరోపించారు. ఇది వన్‌ప్లస్‌, దాని సోదర సంస్థ ఒప్పో అమ్మకాలపై ప్రభావం చూపింది. స్మార్ట్‌వాచ్‌లతో సహా మిగిలిన ఉత్పత్తులు మునుపటిలా విక్రయించబడతాయి. వన్‌ప్లస్ బ్రాండ్ ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు మునుపటిలాగే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

OnePlus ఒక ప్రకటన విడుదల చేసింది

ఈ విషయమై వన్‌ప్లస్ ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలో అంశంపై పరిష్కారం వస్తుందని అభిప్రాయపడింది. తద్వారా జర్మనీలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు మళ్లీ ప్రారంభించవచ్చని భావిస్తోంది. వన్‌ప్లస్‌ అధిక విలువ కలిగిన మేధో సంపత్తి హక్కుల నిబంధనలను వన్‌ప్లస్ అనుసరిస్తుందని తెలిపింది. ఇది పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పేటెంట్ల నియమాలను కూడా అనుసరిస్తుంది. పేటెంట్ అంటే ఏమిటి?

పేటెంట్ అనేది ఒక హక్కు. వినూత్న సాంకేతికత కోసం పేటెంట్ హక్కు ఒక వ్యక్తి లేదా సంస్థకు ఇస్తారు. సరళంగా చెప్పాలంటే శామ్‌సంగ్ AMOLED డిస్‌ప్లేను తయారు చేసిందని అనుకుందాం.. ఇది ఇతర డిస్‌ప్లే టెక్నాలజీలలో ఉత్తమమైనది. అప్పుడు ఇది శామ్‌సంగ్ సొంత టెక్నాలజీ, దీని పేటెంట్ శామ్‌సంగ్‌తో ఉంటుంది. ఏదైనా ఇతర బ్రాండ్ AMOLED టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటే, అది Samsung నుండి అనుమతి తీసుకోవాలి. అలా చేయకపోతే దాని ఉత్పత్తిని నిషేధించవచ్చు.

రాయల్టీ చెల్లించాలి

పేటెంట్ అంటే దాని సాంకేతికతను మరెవరూ కాపీ చేయలేరు. పేటెంట్ అటువంటి చట్టపరమైన హక్కు. మీరు వేరొకరి పేటెంట్ టెక్నాలజీని ఉపయోగిస్తే, మీరు దాని కోసం అనుమతి తీసుకోవాలి. మీరు రాయల్టీ కూడా చెల్లించాలి.

ఇది కూడా చదవండి: Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి