- Telugu News Photo Gallery Business photos Expressway Toll Charges Hike: New toll rates implemented on this expressway, travel became costlier by 12 percent
Toll Charges Hike: వాహనదారులకు షాక్.. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భారీగా టోల్ ఛార్జీల పెంపు..!
టోల్ ఛార్జీల విషయంలో కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ ఉండకుండా ఉండేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. వాహనదారులకు సులభంగా టోల్ ఛార్జీలు వసూలు చేసే విధంగా చర్యలు చేపడుతోంది. అయితే తాజాగా టోల్ ..
Updated on: Oct 04, 2024 | 1:30 PM

యమునా ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ఛార్జీలు బుధవారం రాత్రి నుండి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్త టోల్ రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో గ్రేటర్ నోయిడా-ఆగ్రా మధ్య ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం 12 శాతం మేర పెరిగింది.

కొత్త టోల్ రేట్లు యమునా అథారిటీ 82వ బోర్డు మీటింగ్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఆపరేటింగ్ కంపెనీ జేపీ ఇన్‌ఫ్రాటెక్ కొత్త టోల్ రేట్లను అమలు చేసింది.

యమునా ఎప్రెస్‌వే టోల్ రేట్లు పెంపు 26 సెప్టెంబర్‌న జరిగిన యమునా అథారిటీ 82వ బోర్డు సమావేశంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ రేట్లను పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని కింద ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్‌ను ఐదు శాతం నుండి 12 శాతానికి పెంచారు. ఈ పెంపుదల అక్టోబరు 1 నుంచి చేయడానికి ఆమోదం పొందింది.

అయితే కార్యాలయ ఉత్తర్వుల జారీలో జాప్యం కారణంగా, అక్టోబర్ 2 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది. కొత్త టోల్ రేట్లు అమలులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించే డ్రైవర్లు తదనుగుణంగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

యమునా అథారిటీ నుండి టోల్ రేటు పెంపు ఉత్తర్వులు అందిన తరువాత, బుధవారం అర్ధరాత్రి నుండి కొత్త రేట్లు అమలులోకి వచ్చినట్లు యమునా ఎక్స్‌ప్రెస్‌వే యొక్క జెవార్ టోల్ ప్లాజా మేనేజర్ జెకె శర్మ తెలిపారు.




