AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: నెలకు మినిమం రూ. 50 వేలు ఆదాయం.. ఇంట్లోనే వ్యాపారం..

చాక్లెట్.. ఈ పేరు వినగానే చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లూరుతుంటాయి. అందరూ ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ల తయారీనే వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో చాక్లెట్ తయారీ మంచి వ్యాపార అవకాశంగా మారింది. బ్రాండెండ్‌ కంపెనీలకు...

Business Idea: నెలకు మినిమం రూ. 50 వేలు ఆదాయం.. ఇంట్లోనే వ్యాపారం..
Business Idea
Narender Vaitla
|

Updated on: Jan 12, 2024 | 9:09 PM

Share

ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే దిశగా యువత అడుగులు వేస్తోంది. ఇందుకోసం గాను కొంగొత్త వ్యాపార ఆలోచనలు చేస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చాక్లెట్.. ఈ పేరు వినగానే చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లూరుతుంటాయి. అందరూ ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ల తయారీనే వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో చాక్లెట్ తయారీ మంచి వ్యాపార అవకాశంగా మారింది. బ్రాండెండ్‌ కంపెనీలకు చెందిన చాక్లెట్స్‌తో పాటు లోకల్‌ బ్రాండ్‌లకు సైతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలో మంచి ఆదరణ లభిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా చాక్లెట్లకు డిమాండ్‌ ఉంటుంది.

ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేయాలనుకునే వారికి హోమ్‌ మేడ్ చాక్లెట్ వ్యాపారం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే ఇంట్లోనే చాక్లెట్‌ తయారీని చేసుకునే వీలుండడంతో స్థలానికి డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. చాక్లెట్ తయారీ చేయడంలో మెలుకువలు నేర్చుకోవడం, చాక్లెట్ తయారీకి కావాల్సిన ముడి సరుకులు ఉంటే చాలు వ్యాపారం ప్రారంభించవచ్చు.

సాధారణంగా చాక్లెట్ తయారీకి పాల ఉత్పత్తులు, చక్కెర, ఫ్రూట్స్‌, కోకో వంటి ముడి సరకులు ఉపయోగపడతాయి. వీటితో పాటు చాక్లెట్స్‌ను చుట్టడానికి రేపర్స్‌ అవసరపడతాయి. చాక్లెట్స్‌ను తయారు చేసి సొంత బ్రాండ్‌ పేరు మీద మార్కెట్‌ చేసుకోవచ్చు. దగ్గర్లో ఉన్న కిరాణాల దుకాణాలు, సూపర్‌ మార్కెట్లతో ముందుగానే ఒప్పందం చేసుకొని చాక్లెట్ల తయారీ ప్రారంభించవచ్చు.

ఇక ఆదాయం విషయానికొస్తే.. చాక్లెట్ బిజినెస్‌ ద్వారా నెలకు కనీసంలో కనీసం రూ. 30 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని పెంచి, ఉత్పత్తిని మరింత పెంచితే నెలకు రూ. లక్ష వరకు కూడా ఆదాయం పొందొచ్చు. అలాకాకుండా ఒక పరిశ్రమ మార్చి భారీ యంత్రాల ద్వారా చాక్లెట్‌ తయారీని ప్రారంభించే నెలకు రూ. 3 లక్షల వరకు కూడా ఆదాయం పొందొచ్చు. మీరు ఆదాయం పొందుతూనే మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా