Flight Journey: విమాన ప్రయాణంలో టేకాఫ్..ల్యాండింగ్ సమయంలో విండో షట్టర్స్ ఎందుకు తెరిచి ఉంచాలి.. తెలుసా?
Flight Journey: మీరు విమానంలో ప్రయాణించారా? విమానం కిటికీలు తెరిచి ఉంచమని ఫ్లైట్ అటెండెంట్లు గట్టిగా చెబుతుంటారు. మరీ ముఖ్యంగా విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతున్నపుడు కచ్చితంగా విండో షట్టర్లు తెరిచి ఉంచాలని సూచిస్తారు.
Flight Journey: మీరు విమానంలో ప్రయాణించారా? విమానం కిటికీలు తెరిచి ఉంచమని ఫ్లైట్ అటెండెంట్లు గట్టిగా చెబుతుంటారు. మరీ ముఖ్యంగా విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతున్నపుడు కచ్చితంగా విండో షట్టర్లు తెరిచి ఉంచాలని సూచిస్తారు. వాళ్ళు చెప్పిన వెంటనే బుద్ధిగా ఆపని చేసేస్తారు కొందరు. కొందరు పదే పదే చెప్పగా అది తప్పనిసరి అన్నట్టుగా బలవంతంగా చేస్తారు. అసలు ఎందుకు ఇలా చేయమంతున్నారో తెలిస్తే ఇంత ఇబ్బంది పడుతూ ఆ పని చేయరు. చాలా మందికి విమానంలో కిటికీలు తెరిచి ఉంచమని ఎందుకు చెబుతారు అనే విషయం తెలియదు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.
విమానం గాలిలోకి ఎగిరే సమయం.. అదేవిధంగా కిందకి దిగే సమయం రెండూ చాలా ప్రమాదకరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు సందర్భాల్లోనూ ఏ పొరపాటు జరిగినా విమానం ప్రమాదంలో పడుతుంది. విమానంలో టేకాఫ్ మరియు ల్యాండింగ్ రెండూ చాలా ప్రమాదకరమని మనందరికీ తెలుసు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైగా ఆ విషయం మనకు తెలుసు కనుక రెండు సందర్భాలలోనూ మనకు తెలీకుండానే భయపడతాం. కిటికీలు తెరిచి ఉంచడం ద్వారా మన దృష్టి ఆ సమయంలో కచ్చితంగా బయట వైపు మరలుతుంది. దీంతో మనసులో భయాలు చోటు చేసుకునే అవకాశం తగ్గి రిలాక్స్ గా ఉండగలుగుతాము. ఇక ఇలా చేయడం వల్ల మన కళ్ళు విమానం వెలుపల ఉండే కాంతికి అలవాటు పడతాయి.
ఇక విమానం కిటికీ తెరచి ఉంచడం ద్వారా విమాన సహాయకులు విమానం వెలుపల కనిపించే రెక్కలను సులభంగా చూడగలుగుతారు. ఒకవేళ రెక్కల ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటె వారికి సులభంగా అర్ధం అవుతుంది. దానిని వెంటనే విమాన కెప్టెన్ కు చెప్పి అలెర్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా అప్పుడు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో సులభంగా ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు అనే విషయం మనకు అర్ధం అవుతుంది.
ఈ క్రమంలో విండోను తెరిచి ఉంచడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. కిటికీలు మూసివేస్తే, విమానం లోపల ఏమి జరుగుతుంది? అనేది బయటి వ్యక్తులు చూడలేరు. క్యాబిన్ మంటల్లో ఉన్నా లేదా పొగ వస్తున్నా, కిటికీ మూసివేస్తే అది బయటివారికి కనిపించదు. కిటికీలు తెరిచి ఉంచినట్లయితే, విమానం లోపల వారికి ఏమి జరుగుతుంది? స్పష్టంగా చూడవచ్చు. విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతున్నప్పుడు కిటికీ తెరిచి ఉంచడం ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మనకు స్పష్టం అయింది కదా.
కాబట్టి విమానంలో ప్రయాణించేటప్పుడు విండోను తెరిచి ఉంచడం మర్చిపోవద్దు. ఇందులో మీ భద్రత మాత్రమే కాకుండా ఇతర ప్రయాణీకుల భద్రత కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. అదే సమయంలో విండోను తెరిచి ఉంచడం మీకు మంచి అనుభవాన్ని ఇస్తుందనె విషయమూ మీకు స్పష్టం అవుతుంది. అవును, మీరు కిటికీ తెరవడం ద్వారా ఆకాశ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి విమానం ఎగురుతున్నప్పుడు కిటికీ తెరిచి ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
UFO Video: భూమిపైకి వచ్చిన ఏలియన్స్ యూఎఫ్‌వోలు..? వైరల్ అవుతోన్న అమెరికాకు చెందిన రాడార్ వీడియో..