Personality test: మీరు పిడికిలి బిగించే విధానాన్ని బట్టి.. మీరెలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే
కేవలం మన చేతిలోని రేకలే కాదు మన శరీరంలోని వివిధ భాగాలు, మన అలవాట్లు కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. వాటిలో మన చేతి పిడికిలి కూడా ఒకటి. మన చేతి పిడికిలిని బిగించే విధానాన్ని బట్టి కూడా మన వ్యక్తత్వాన్ని అంచనా వేయవచ్చు.కానీ ఇలాంటి విషయాలు తెలియక చాలా మంది తమ వ్యక్తిత్వం గురించి తెలుసుకునేందుకు జోతిష్యుల దగ్గరకు వెళ్తారు. కాబట్టి మన శరీరంలోని భాగమైన చేతి పిలిడికిలి మన వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తుందో ఇప్పుడు మనం తెలసుకుందాం.

భూమ్మీద నివసించే ఒక్కో వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అలాగే వారి శరీర నిర్మాణం కూడా బిన్నంగా ఉంటుంది.వారి అలావట్లు అభిరుచులు కూడా భిన్నంగా ఉంటాయి.అయితే మన చేతిరేకలు ఎలాగైతే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయో.. మన శరీరంగోని వివిధ భాగాలు కూడా అలానే మన వ్యక్తిత్వాన్ని చూసిస్తాయి. వాటిలో మన చేతి పలిడికిలిని భించే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అవును ఒక వ్యక్తి తన పిడికిలిని ఎలా భిగిస్తున్నాడో అనే దానిని బట్టి మనం ఆ వ్యక్తి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.వీటిలో ముఖ్యంగా జనాలు మూడు రకాలు తమ పిడికిలిన బిగిస్తారు. బొటనవేలు బయటపెట్టి, బొటనవెలు వెళ్లలొపల పెట్టి, బొటనవేలి వేళ్ల పక్కన పెట్టి పిడికిలి బిగిస్తారు. కాబట్టి ఇందులో ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.
చూపుడు వేలుపై బొటనవేలు: కొంతమంది తమ బొటనవేలును పిడికిలిలో బిగించిన చూపుడు వేలుపై ఉంచుతారు.ఈ వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలతో ఉంటారు. వారు బాల్యం నుండే అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. వీరు చాలా తెలివైన వారు, వారు ఎల్లప్పుడూ తమ లక్ష్యాలపై దృష్టి పెడతారు. వారు ఒక లక్ష్యాన్ని సాధించాలని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత, అది సాధించే వరకు వారు వదులుకోరు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో, మంచి సలహా ఇవ్వడంలో కూడా వీరు ముందుంటారు
వేళ్లపై బొటనవేళ్లు: కొంతమంది పిడికిలి బిగించేటప్పుడు తమ బొటనవేళ్లను అన్ని వేళ్లపై ఉంచుతారు. ఈ వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు. వారు తమ ఆత్మగౌరవానికి విలువ ఇస్తారు. వారి మనోహరమైన వ్యక్తిత్వం ప్రజలను చాలా ఆకర్షిస్తుంది. వారు నిజాయితీపరులుగా ఉంటారు. అలాగే తెలివైనవారు కూడా.వీరు ఎప్పుడూ అహంకారానికి పోరు. అలాగే చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు.ఆత్మవిశ్వాసమే వారి విజయానికి ప్రధాన కారణం. వీరు వారికి వ్యతిరేకంగా ఉన్న అవకాశాలను కూడా సానుకూలంగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు.
బొటనవేలిని అన్ని వేళ్ల లోపల ఉంచి పిడికిలి బిగించడం: కొంతమంది తమ బొటనవేలు ఇతర వేళ్ల లోపల ఉంచి పిడికిలి బిగించడం చేస్తారు. అలాంటి వ్యక్తులు అంతర్ముఖులు. వారు తమ విషయాలన్నింటినీ ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతారు.అంతర్ముఖులు తమ భావాలను, సంబంధాలను గౌరవించే వ్యక్తులతో ఉండటానికి ఇష్టపడతారు. కష్టతరమైన లేదా రెచ్చగొట్టే వాతావరణంలో కూడా వారు శాంతిని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.వీరిలో ఉండే ఈ అలవాటే వారిని ఆకర్షణీయంగా చేస్తుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
