ఆపరేషన్ టైంలో డాక్టర్స్.. ఈ రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు కారణం ఇదే..
మీరు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు,నర్సులు ఎక్కువగా గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించడం ఎక్కువగా చూసి ఉంటారు. కానీ వారు ఎప్పుడూ ఇవే రంగు దుస్తువులు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? అయితే అలసు దీని వెనక ఉన్న శాస్త్రీయ, ఆరోగ్య,సాంప్రదాయ కారణాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆపరేషన్ సమయంలో డాక్టర్‌లు ఎక్కువగా కర్తాన్ని చూస్తారు. అది ఎరుపు రంగులో ఉంటుంది. మన శరీరంలోని అవయవాల్లో కూడా మొత్తం రక్ నిండి ఉంటుంది.దీంతో వాళ్లు ఎక్కువ సమయం ఎరుపు రంగునే చూడాల్సి వస్తుంది.ఈ ఎరుపురంగు వారి కళ్లపై ఒత్తిడి తెస్తుంది.అలాంటి సందర్భంలో ఆకుపచ్చ లేదా నీలం రంగులు చూడడం వల్ల కళ్లకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.దీంతో వైద్యులు సూక్ష్మవస్తువులను కూడా స్పష్టంగా చూడగలుగుతారు.
ఏకాగ్రతను పెంచడం
కొన్ని ఆపరేషన్స్ గంటల తరబడి చేయాల్సి ఉంటుంది.అలాంటి పరిస్థితుల్లో వైద్యులు పరధ్యానంలో పడటం సహజం. ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు వంటి ప్రశాంతమైన రంగులు మనస్సును రిఫ్రెష్ చేస్తాయి. ఇవి ఎక్కువసేపు దృష్టి పెట్టడంలో, పనితీరును పెంచడంలో సహాయపడతాయి.
లైటింగ్ ప్రభావ నియంత్రణ
ఆపరేషన్ థియేటర్లలో చాలా తీవ్రమైన లైట్స్‌ను ఉపయోగిస్తారు.అలాంటప్పుడు డాక్టర్లు తెల్లటి దుస్తులు ధరిస్తే, ఆ కాంతి ప్రతిబింబించి కళ్ళపై ఎఫెక్ట్ పడుతుంది.అలా పండకుండా ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులు ధరిస్తారు. ఇవి కాంతిని రిప్లెక్ట్ చేయవు.
పరిశుభ్రత,ఇన్ఫెక్షన్ నియంత్రణ
ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులపై ఏదైనా రక్తం లేదా మందు మరకలు ఉంటే వెంటనే కనిపిస్తాయి. ఇది వైద్య సిబ్బంది వాటిని త్వరగా శుభ్రం చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మానసిక ప్రభావాలు ఏమిటి?
రంగులు మన మనస్సుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆకుపచ్చ ఆరోగ్యం, శాంతి భద్రతను సూచిస్తుంది. నీలం విశ్వాసం, స్థిరత్వం, ఏకాగ్రతను సూచిస్తుంది.ఆసుపత్రి వాతావరణంలో, ఈ రంగులు వైద్యులు, రోగులకు విశ్వాసాన్ని ఇస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి.
మనం చరిత్ర సంప్రదాయాన్ని పరిశీలిస్తే..
గతంలో వైద్యులు తెల్లటి దుస్తులు ధరించేవారు. కానీ 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు తెలుపు రంగు కళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుందని కనుగొన్నారు. ఆ తర్వాత ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులను ఉపయోగించే పద్ధతి ప్రారంభించారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




