AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటది మరి.. స్టంట్ చేయబోయి.. స్టన్న్ అయిన యువతి!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏదో విధంగా ఫేమస్ అవ్వాలనే కారణంతో కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని చూసి జనం ఆశ్చర్యపోవడమే కాకుండా నవ్వుతున్నారు.

Video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటది మరి.. స్టంట్ చేయబోయి.. స్టన్న్ అయిన యువతి!
Young Lady Fire Stunt
Balaraju Goud
|

Updated on: Oct 20, 2025 | 3:53 PM

Share

కొందరు అద్భుతమైన స్టంట్స్‌తో తెగ ఆకట్టుకుంటారు. కొన్నిసార్లు స్టంట్స్ వల్ల ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని చూసి జనం ఆశ్చర్యపోవడమే కాకుండా నవ్వుతున్నారు. నిజానికి, రోడ్డుపై చేస్తున్న షోలో ఒక అమ్మాయి తన నోరు తృటిలో కాలిపోకుండా అలాంటి ఫీట్ చేసింది. ఆ షోలో ఆ అమ్మాయి తన నోటి నుండి నిప్పు ఊదే ఫీట్ చేయాల్సి వచ్చింది. కానీ కొన్ని సెకన్ల అంతా తారుమారు అయ్యింది. అతి కష్టం మీద ఆ అమ్మాయి నోటిలోని మంట ఆరిపోయింది. కొంచెం ఆలస్యం అయినా, ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.

ఈ వీడియోలో, ఆ అమ్మాయి నోటిలో పెట్రోల్ పోసుకుని మంటల్లో ఉన్న కర్రను పట్టుకుంది. పెట్రోల్ పోసి స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఆమె నోటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొన్ని సెకన్లలోనే, మంటలు ఎంత తీవ్రంగా పెరిగిపోయాయంటే, ఆ అమ్మాయి తలకు అంటుకున్నాయి. దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో, మరొక అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అందుకే నిప్పుతో ఎప్పుడూ చెలగాటం ఆడకూడదని అంటారు.

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @bipinyadav8933 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. “దీదీ ఈ షోను మరింత మసాలా చేయాలని అనుకున్నారు, కానీ అది బెడిసికొట్టింది.” ఈ 16 సెకన్ల వీడియోను 98 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వందలాది మంది దీన్ని లైక్ చేసి, వివిధ రకాల ప్రతి స్పందనలు తెలియజేస్తున్నారు. జీవితాన్ని ప్రమాదంలో పడేసే స్టంట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటూ వినియోగదారు కామెంట్ చేశారు. “ఈ దీదీ తన జీవితంలో మళ్లీ ఎప్పుడూ స్టంట్ చేయదు.” అంటూ పేర్కొన్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..