AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జస్ట్ మిస్.. ‘కొంచెం ఆలస్యమైనా అంతే సంగతులు’.. ధైర్యముంటేనే వీడియో చూడండి

ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

Watch Video: జస్ట్ మిస్.. 'కొంచెం ఆలస్యమైనా అంతే సంగతులు'.. ధైర్యముంటేనే వీడియో చూడండి
Snake Viral Video
Ravi Kiran
|

Updated on: Oct 20, 2022 | 12:50 PM

Share

సాధారణంగా పాములంటే చాలు.. ప్రతీ ఒక్కరికీ భయం ఉంటుంది. వాటిని దూరం నుంచి చూస్తే.. గుండె జారి గల్లంతవుతుంది. అక్కడ నుంచి దెబ్బకు పరుగులు పెడతారు. అయితే ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. స్కూల్ బస్సులో, బైక్ స్పీడోమీటర్‌లో, ఇళ్లల్లోకి, రోడ్లపై.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడి చూసినా అనుకోని అతిధుల్లా ప్రత్యక్షమై.. జనాలకు దడ పుట్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో కూడా పాములకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా అదే కోవలో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కొన్ని సెకన్ల వ్యవధిలో ఓ స్కూల్ విద్యార్ధి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొల్లా జిల్లా కూన్నతుర్లో చోటు చేసుకుంది. తన ఇంటి గేటు బయట ఎవరితోనూ మాట్లాడిన ఓ స్కూల్ విద్యార్ధి.. కొద్దిసేపటి తర్వాత గేట్ వేసి లోపలి వచ్చాడు. అలా వస్తున్నప్పుడు.. అతడు మొక్కల మాటున దాగున్న పామును గమనించాడు. అలా ఆ యువకుడు అడుగు ముందుకేశాడో.. లేదో.. ఆ నాగుపాము అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. సెకన్ల వ్యవధిలో ఆ యువకుడు దాన్ని నుంచి తప్పించుకుని లోపలికి పరుగులు పెట్టాడు. అనంతరం అతడు ఆ గేటును తెరిచి.. లోపలికి వెళ్లి తన తల్లిని పామును చూపించేందుకు తీసుకురాగా.. అది అక్కడ నుంచి మెల్లిగా జారుకుంది.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘యువకుడు అదృష్టవంతుడని.. కొంచెం ఆలస్యమైనా అంతే సంగతులు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..