AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదువుకునే విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్ ఉంటుందో పెద్దలు అనేక సార్లు చెప్తుంటే వినేవాళ్ళం. అలాంటి స్టోరీనే ఇది. మనలానే, మన మధ్యలోనే ఉంటూ కష్టపడి చదువుతూ క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఈ విద్యార్థి కథ నేటితరం యువతకు స్ఫూర్తి దాయకం.

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
Sriram Varun Get Stanford University
Eswar Chennupalli
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 30, 2024 | 4:17 PM

Share

క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదువుకునే విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్ ఉంటుందో పెద్దలు అనేక సార్లు చెప్తుంటే వినేవాళ్ళం. అలాంటి స్టోరీనే ఇది. మనలానే, మన మధ్యలోనే ఉంటూ కష్టపడి చదువుతూ క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఈ విద్యార్థి కథ నేటితరం యువతకు స్ఫూర్తి దాయకం.

విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని కూడా పొందాడు. ఈ విషయాన్ని సగర్వంగా ఉన్నట్లు చెప్పారు శ్రీరామ్. అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలో కూడా తనకు సీటు లభించిందని, అదే సమయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో సీట్ రావడంతో అందులోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు శ్రీరామ్ వరుణ్ తెలిపారు. దేశంలో చాలా తక్కువ మందికే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందని, రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ వివరించారు.

తల్లి తండ్రులు ఇద్దరూ డాక్టర్‌లే..

ఇంతటి ఘనత సాధించిన శ్రీరామ్ వరుణ్ తల్లిదండ్రులు ఎవరా అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ ప్రారంభం అయింది. తండ్రి డాక్టర్‌ వి.రాజ్‌కమల్‌ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శస్త్ర చికిత్స విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ తల్లి డాక్టర్‌ సౌదామిని. ఈమె ప్రస్తుతం విశాఖలో ప్రముఖ గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్

శ్రీరామ్ వరుణ్‌ చిన్ననాటి నుంచీ మెరిట్ స్టూడెంట్. 10వ తరగతిలో A ప్లస్ గ్రేడ్ సాధించిన వరుణ్ ఇంటర్మీడియట్‌లో 983 మార్కులతో స్టేట్ ర్యాంకర్ గా నిలబడ్డారు. అనంతరం ఐఐటీ జేఈఈ అడ్వాన్సుడ్‌లో ఆల్ ఇండియా 178వ ర్యాంకు సాధించి కాన్పూర్‌ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూ లో సౌత్ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సంస్థలో రీసెర్చ్‌ ఇంజినీరుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వరుణ్ వార్షిక వేతనం 1.25కోట్ల రూపాయలు. తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటును స్కాలర్‌షిప్‌తో దక్కించుకోవడంతో ఉన్నత చదువులకు బయల్దేరి అమెరికా వెళ్తున్నట్లు శ్రీరామ్ వరుణ్ కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…