Body Massage: బాడీ మసాజ్‌ ఎందుకు, ఎవరికి అవసరం..? తప్పక తెలుసుకోవాలి.

వయసు యాభై దాటితే మీ దినచర్యలో బాడీ మసాజ్ కూడ చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 45 నుంచి 50 దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి అరుగుదల క్రమంగా మొదలవుతుంది. ఫలితంగా పని సామర్థ్యం తగ్గి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ బాడీ మసాజ్ చాలా అవసరం.

Body Massage: బాడీ మసాజ్‌ ఎందుకు, ఎవరికి అవసరం..? తప్పక తెలుసుకోవాలి.

|

Updated on: Mar 30, 2024 | 3:45 PM

వయసు యాభై దాటితే మీ దినచర్యలో బాడీ మసాజ్ కూడ చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 45 నుంచి 50 దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి అరుగుదల క్రమంగా మొదలవుతుంది. ఫలితంగా పని సామర్థ్యం తగ్గి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ బాడీ మసాజ్ చాలా అవసరం. ఇందుకోసం మన ఇంట్లోనే రోజూ ఉదయం స్నానం చేయడానికి ఓ అరగంట ముందు 10-15 నిమిషాల పాటు మనకు మనంగా బాడీ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ పెయిన్స్‌ మరీ ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపీ వంటివి తప్పవు. బాడీ మసాజ్‌తో ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి. ముందే ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్టయితే అవి తగ్గిపోతాయంటున్నారు. ఇంట్లోనే బాడీ మసాజ్‌ ఎలా చేసుకోవాలి.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో కూడా తెలుసుకుందాం..

ఇంట్లోనే బాడీ మసాజ్‌ చేసుకోడానికి కొబ్బరి నూనె లేదా బాదం నూనెను ఉదయం స్నానానికి వెళ్ళేముందు ఓ పది పదిహేను నిమిషాల పాటు ఆయిల్‌తో బాడీ మసాజ్ క్రమం తప్పకుండా చేసుకుంటే..చక్కటి ఫలితం ఉంటుంది. ఇందుకోసం కావాలంటే మంచి ఆయుర్వేద పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాడినా మంచి ఫలితాలే వస్తాయి. మసాజ్‌ కోసం కావాల్సిన ఆయిల్‌ తీసుకుని మన చేతి వేళ్ళతోనే రాపిడి ప్రెషర్ తో ఒళ్ళంతా పట్టించాలి. ఓ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే ఒళ్లు నొప్పులు మన దరి చేరవంటున్నారు. బాడీ పెయిన్స్‌ విషయంలో ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. లేదంటే ఆ తర్వాత వైద్యం కోసం, ఫిజియోథెరపీ మెడిసిన్లు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి జాయింట్‌ పెయిన్స్‌, బాడీ పెయిన్స్ మరింత తీవ్రమైతే వేలకు వేలు పెట్టి ఖరీదైన సర్జరీలు, టెన్షన్లు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఒళ్లు నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి రోజూ మనం బాడీ మసాజ్ అలవాటు చేసుకుంటే.. ఎన్నో అనారోగ్య ‌సమస్యలను రాకుండా ముందే అడ్డుకోగలం అంటున్నారు. ప్రతిరోజూ మార్నింగ్ వాక్ తరువాత రెగ్యులర్‌గా బాడీ మసాజ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. బాడీ మసాజ్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 25 రకాల లాభాలు ఉన్నాయని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాడీ మసాజ్ వలన రక్తప్రసరణ బాగా మెరుగవుతుంది. లో బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. మజిల్స్ టెన్షన్ ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ బాడీ పెయిన్స్‌ ఉంటే తగ్గుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles