Bus Ticket for Parrots: నాలుగు చిలుకలకు రూ.444 టికెట్.! బెంగళూరు బస్సులో విచిత్ర ఘటన.
ఓ వ్యక్తి కోడి పుంజును బస్సులో తీసుకురాగా.. దానికి కండక్టర్ ఫుల్ టిక్కెట్ వసూలు చేసిన ఘటన వైరల్ అయింది. తాజాగా, బెంగుళారులోని కేఎస్ఆర్టీసీలో బస్సులో అటువంటి విచిత్రమైన ఘటననే చోటుచేసుకుంది. ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నాలుగు చిలుకల కోసం కండక్టర్ కు 444 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుంది. మనవరాలితో బస్సు ఎక్కిన ఆ మహిళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శక్తి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణం చేసింది.
ఓ వ్యక్తి కోడి పుంజును బస్సులో తీసుకురాగా.. దానికి కండక్టర్ ఫుల్ టిక్కెట్ వసూలు చేసిన ఘటన వైరల్ అయింది. తాజాగా, బెంగుళారులోని కేఎస్ఆర్టీసీలో బస్సులో అటువంటి విచిత్రమైన ఘటననే చోటుచేసుకుంది. ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నాలుగు చిలుకల కోసం కండక్టర్ కు 444 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుంది. మనవరాలితో బస్సు ఎక్కిన ఆ మహిళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శక్తి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణం చేసింది. ఆర్టీసీ బస్సులో చిలుకలతో ప్రయాణించిన ఓ పెద్దావిడకు కండక్టర్ షాకిచ్చాడు. బుట్టలో ఉన్న నాలుగు చిలుకలకు ఏకంగా ప్యాసింజర్ టిక్కెట్ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. పక్షులకు టిక్కెట్ ఏంటని అడిగితే.. దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో ఆమె ఖంగుతింది. దీంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్తోన్న కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సులో చోటుచేసుకుంది.
నాలుగు చిలుకలకు ఒక్కొక్కదానికి రూ.111 చొప్పున రూ.444ల టికెట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లు కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు సగం టికెట్ ధర చెల్లించాలని తెలిపారు. టికెట్ తీసుకోని పక్షంలో ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్ ధరలో పది శాతం జరిమానా విధిస్తామని.. ఇవ్వని కండక్టర్‌పైనాచట్టరీత్యా చర్యలు తీసుకోవటం నిబంధనల్లోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.