AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari - Siddharth: అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్‌ చేసిన సిద్ధార్థ్‌.! ఆయనేమన్నరంటే.?

Aditi Rao Hydari – Siddharth: అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్‌ చేసిన సిద్ధార్థ్‌.! ఆయనేమన్నరంటే.?

Anil kumar poka
|

Updated on: Mar 30, 2024 | 4:18 PM

Share

నటుడు సిద్ధార్థ్‌, నటి అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. నిశ్చితార్థం జరిగినట్లు చెప్పారు. సిద్ధార్థ్‌.. ఇద్దరూ కలిసి ఉంగరాలు తొడిగిన ఫొటోని షేర్‌ చేస్తూ .. ఆమె ఎస్‌ చెప్పింది.. ఎంగేజ్డ్‌అని పేర్కొన్నారు. అదే ఫొటోని ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. అతడు ఎస్ చెప్పాడు అని తెలిపింది.

నటుడు సిద్ధార్థ్‌, నటి అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. నిశ్చితార్థం జరిగినట్లు చెప్పారు. సిద్ధార్థ్‌.. ఇద్దరూ కలిసి ఉంగరాలు తొడిగిన ఫొటోని షేర్‌ చేస్తూ .. ఆమె ఎస్‌ చెప్పింది.. ఎంగేజ్డ్‌అని పేర్కొన్నారు. అదే ఫొటోని ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. అతడు ఎస్ చెప్పాడు అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మణిరత్నం కాంపౌండ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్‌, అదితి.. తొలిసారి మహా సముద్రం కోసం కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. అయితే గతేడాది న్యూ ఇయర్‌కి రిలేషన్‌షిప్‌ని రివీల్‌ చేశారు అదితి.

ఆమె కోసమే తరచూ ముంబై వెళ్లొస్తున్న సిద్ధార్థ్.. అదితి పుట్టినరోజున ‘పార్ట్‌నర్‌’ అంటూ పోస్ట్ కూడా చేశారు. సినిమాలు రిలీజ్‌ అయిన ప్రతిసారీ పరస్పరం సపోర్ట్ చేసుకున్నారు సిద్ధార్థ్‌, అదితిరావు. సినీ, పబ్లిక్‌ ఈవెంట్స్‌కు కూడా ఎన్నో సార్లు వీరిద్దరు కలిసే హాజరయ్యారు. వనపర్తి సంస్థాన చివరి రాజు జే. రామేశ్వరరావు మనుమరాలు అదితి రావు హైదరి. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు జె రామేశ్వరరావు వారసులు. దీంతో బుధవారం ఉదయం వీరి ఎంగేజ్‌మెంట్‌ అదే ఆలయంలో జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..