Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎందుకు కనిపెట్టారో తెలుసా? రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణకు అస్సలు కాదు..!
ఫలితంగా ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోయింది. అలాంటి పరిస్థితిలో భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అనేక రకాల ట్రాఫిక్ సంకేతాలను మనం చూస్తూనే ఉంటాం. అలాగే కీలక కూడళ్లలలో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. రెడ్ లైట్ పడితే ఆగడం, గ్రీన్ పడితే ముందుకు సాగడం, ఆరెంజ్ లైట్

Traffic Signal History: ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే.. రోడ్డు మార్గంలోనే వెళతాం. గతంలో అంటే అందరూ నడచుకుంటూ వెళ్లేవారు. కొందరు సైకిళ్లపై వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉంది. దాంతో రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోయింది. అలాంటి పరిస్థితిలో భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అనేక రకాల ట్రాఫిక్ సంకేతాలను మనం చూస్తూనే ఉంటాం. అలాగే కీలక కూడళ్లలలో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. రెడ్ లైట్ పడితే ఆగడం, గ్రీన్ పడితే ముందుకు సాగడం, ఆరెంజ్ లైట్ పడితే వాహనాన్ని స్లో చేసుకోవడం మనకు తెలిసిందే. మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఎవరు కనిపెట్టారు? అసలు రోడ్లపై ట్రాఫిక్సిగ్నల్స్‌ను ఎవరు ఏర్పాటు చేశారు? అనే ఇంట్రస్ట్రింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ట్రాఫిక్ సిగ్నల్‌ను ఎవరు కనిపెట్టారు?
వాస్తవానికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్‌ని రైల్వే కోసం కనిపెట్టడం జరిగింది. బ్రిటీష్ రైల్వే మేనేజర్ జాన్ పీక్ నైట్ రైలు ట్రాఫిక్‌ను నియంత్రించడానికి రైల్‌రోడ్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్ జేపీ నైట్ మొదటి ట్రాఫిక్ సిగ్నల్‌ను కనుగొన్నారు.
అప్పట్లో ఇలా ఉండేది..
సెమాఫోర్ వ్యవస్థను రైల్‌రోడ్‌లలో ఉపయోగించారు. ఇందులో ఒక స్తంభానికి చిన్న బోర్డు ఏర్పాటు చేశారు. ఇది రైలు ప్రయాణాన్ని సూచిస్తుంది. దీని ఆధారంగా పగటిపూట ‘స్టాప్’, ‘గో’ సిగ్నల్స్ ఇచ్చారు. రాత్రి సమయంలో ఎరుపు, ఆకుపచ్చ లైట్లను ఉపయోగించి సిగ్నల్ ఇవ్వడం జరిగంది. ఇందుకోసం గ్యాస్ ల్యాంప్‌లను ఉపయోగించారు. ఈ ల్యాంప్‌లను ఆపరేట్ చేయడానికి ప్రతి పిల్లర్ వద్ద భద్రతా సిబ్బంది ఉండేవారు.
ప్రపంచంలో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్..
డిసెంబర్ 1868లో లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంతంలోని బ్రిడ్జ్ స్ట్రీట్, గ్రేట్ జార్జ్ స్ట్రీట్ జంక్షన్ వద్ద, పార్లమెంట్ హౌస్, వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జ్ సమీపంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో రాత్రిపూట గ్యాస్‌తో ఆపరేట్ చేశారు. అయితే, ఒకసారి దురదృష్టవశాత్తు అది పేలి ఒక పోలీసు అధికారి మరణించాడు. ఈ ప్రమాదం తర్వాత.. సిగ్నలింగ్ వ్యవస్థ డెవలప్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించారు.
ట్రాఫిక్ లైట్ చరిత్ర..
1800ల నుంచి ఆటోమొబైల్‌ను కనిపెట్టని నాటి నుంచి ట్రాఫిక్ జామ్ సమస్య కొనసాగుతోంది. ఆ సమయంలో లండన్ వీధులు పాదచారులు, గుర్రపు బండిలతో రద్దీగా ఉండేవి. ది గార్డియన్ ఒక పరిశోధన ప్రకారం.. ఆధునిక ట్రాఫిక్ లైట్‌ను ఒక అమెరికన్ ఆవిష్కరించారు. ఇది క్లీవ్‌ల్యాండ్‌లో 1914లో ఏర్పాటు చేశారు. 1926లో వోల్వర్‌హాంప్టన్ ఆటోమేటిక్ సిగ్నల్‌లను ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అలా క్రమంగా సిగ్నల్ వ్యవస్థ డెవలప్ అయ్యింది. రైల్వే ట్రాఫిక్ కోసం తయారు చేసిన సిగ్నల్ వ్యవస్థ.. రోడ్డు మార్గానికి కూడా ఉపకరిస్తుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




