AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Melon: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. దీని ధరతో 30 తులాల బంగారం కొనొచ్చు..

ఖర్బుజ పండు తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇందులో పొటాషియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. మార్కెట్‌లో దీనికి ఎప్పుడూ డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణం. ఇది ఏప్రిల్ నుండి మే వరకు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. అప్పుడు దాని రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు. కానీ ఈ రోజు మనం వివిధ రకాల ఖర్బూజ పండ్ల గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

King Melon: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. దీని ధరతో 30 తులాల బంగారం కొనొచ్చు..
Expensive Fruit
Shiva Prajapati
|

Updated on: Sep 13, 2023 | 10:40 AM

Share

ఖర్బుజ పండు తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇందులో పొటాషియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. మార్కెట్‌లో దీనికి ఎప్పుడూ డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణం. ఇది ఏప్రిల్ నుండి మే వరకు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. అప్పుడు దాని రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు. కానీ ఈ రోజు మనం వివిధ రకాల ఖర్బూజ పండ్ల గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. ఈ ధరతో లగ్జరీ కారును కూడా కొనుగోలుు చేయొచ్చు.

ఈ ఖర్బుజా పేరు యుబారి కింగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదేనని చెబుతున్నారు. ఇది జపనీస్ మెలోన్ రకం. దీనిని జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు. యుబారి పుచ్చకాయను జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే పండిస్తారు. అందుకే దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు. యుబారి నగరంలోని ఉష్ణోగ్రత ఈ పండుకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పండు ధర రూ.18 లక్షలు..

యుబారి పుచ్చకాయకు ‘అమృతం’లా పనిచేసే యుబారి నగరంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, ఆ పండు తియ్యగా, రుచిగా ఉంటుందని చెబుతారు. యుబారి కింగ్‌కు సంబంధించి మరో కీలక విశేషం ఏంటంటే.. దీనిని నేరుగా విక్రయించరు. వేలం వేస్తారు. 2022 సంవత్సరంలో ఒక యుబారి కింగ్‌ను వేలం వేయగా.. రూ. 20 లక్షలు పలికింది. కాగా, 2021లో ఈ పండు రూ.18 లక్షలు పలికింది. అంటే భారతదేశంలో ఒక యుబారీ ధరతో 30 తులాల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ధనవంతులు మాత్రమే తింటారు..

యుబారి కింగ్ పండులో యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో ఉన్నాయి. మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. కానీ ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే దీనిని తింటారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..