Real and Fake Besan Flour: ఇలా చేస్తే కల్తీ శనగ పిండిని గుర్తించడం చాలా ఈజీ.. ఇది చాలా సింపుల్ టెక్నిక్..
కాదేదీ కల్తీకి అనర్హమంటున్నారు దందాగాళ్లు. పిల్లలు తాగే పాల నుంచి మీరు వాడే పెట్రోల్ వరకు కల్తీచేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అయితే ఇలాంటి కల్తీని ఎలా గుర్తించేందుకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. అయినా వారి ఆగడాలు ఆగడం లేదు. అయితే అత్యధికంగా ఉపయోగించే శనగ పిండి కల్తీని గుర్తించడం ఎలానో తెలుసుకుందాం..

కల్తీ..కల్తీ..కల్తీ.. ఎటు చూసినా కల్తీయే..ఏం తినాలన్నా కల్తీయే..రోజురోజుకు పెరుగుతున్న కల్తీగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. వంట నూనెల నుంచి మసాలాల వరకు..పెట్రోల్ నుంచి పాల వరకు.. కల్తీలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు. రోజుకో కల్తీదందా వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్నిసార్లు అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నా కల్తీ దందాలకు మాత్రం తెరబడడం లేదు. నిత్యకృత్యంగా మారి..ప్రజలను రోగాలపాలు చేస్తున్నాయి. అయితే, మనం నిత్యం మనం ఉపయోగించే అన్ని పిండి వంటల్లో ఈ పిండిని ఉపయోగిస్తుంటాం. కానీ, ఇందులో అసలు.. కల్తీని గుర్తించేందుకు ప్రయత్నించం. శనగ పిండిని పప్పును పట్టించి తయారుచేస్తాం. దాని సహాయంతో మనం పకోడాలు మొదలు కారప్పూస, బజ్జి. బికనీర్ బుజియా, బోండా, బూంది, బూంది లడ్డూ వరకు అన్నింటిని ఈ పిండితో చేస్తాం.
ముఖ్యంగా వర్షాకాలంలోనే కాదు ప్రతి సీజన్‌లో ఈ చిరుతిండిని, టీతోపాటు ఈ పిండితో చేసే స్నాక్స్‌ను ఇష్టంగా తింటాం. మనం తప్పనిసరిగా పకోడాలను చాలా ఆస్వాదిస్తాం. అయితే శనగపిండి ఎంత స్వచ్ఛంగా ఉంటే దాని రుచి అంత ఎక్కవగా ఉంటుంది. ఈ రోజుల్లో కల్తీ మార్కెట్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంది. శనగ పిండి కూడా కల్తీగాళ్లు కంట్లో పడింది. దీంతో మార్కెట్ మొత్తం కల్తీ శనగ పిండితో నింపేశారు. చౌకగా లభించే ఈ శనగ పిండిని అసలు శనగపిండిలా మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ చిట్కాలతో నకిలిని మీరు కూడా చాలా సులభంగా గుర్తించవచ్చు.
శనగపిండి ఎందుకు కల్తీ అవుతుంది?
ఏదైనా ఆహార పదార్ధంలో కల్తీ చేయడం. అసలు ఉద్దేశ్యం అధిక లాభం పొందడమే.. కానీ అలాంటి వ్యాపారులు కస్టమర్ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించరు. కొందరు అందులో మొక్కజొన్న పిండిని కలుపుతారు. కొందరు గోధుమ పిండిని కలుపుతారు.
నిజమైన, నకిలీ గ్రామ పిండిని ఎలా గుర్తించాలి?
1. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పరీక్షించండి
దాని కలర్ చూసి శనగపిండి నాణ్యతను గుర్తించడం అసాధ్యం. ఈ రోజుల్లో ప్యాక్ చేసిన, లూస్‌గా దొరికే శనగపిండి రెండూ కూడా అధిక కల్తీకి గురవుతున్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగించి శనగ పిండి కల్తీని గుర్తించవచ్చు. మీరు ఒక గిన్నెలో 2 నుంచి 3 చెంచాల శనగపిండిని తీసుకుని.. దానికి నీటిని జోడించి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దానిలో 2 టీస్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి కొన్ని నిమిషాలు వేచి ఉండండి. శనగపిండి రంగు ఎర్రగా మారితే అది కల్తీ అని అర్థం చేసుకోండి.
2. నిమ్మకాయ సహాయం తీసుకోండి
నిమ్మకాయ రసంతో శనగ పిండిలోని కల్తీని ఇంట్లోనే గుర్తింవచ్చు. దాని నిమ్మకాయ రసం సహాయంతో మీరు అసలు, నకిలీని సులభంగా గుర్తించవచ్చు. మీరు కేవలం ఒక చిన్న ప్రయోగం చేయాలి. దీని కోసం, ఒక పాత్రలో 3 చెంచాల శనగపిండిని తీసుకుని, అదే చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. దాదాపు 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత శనగపిండి రంగు గోధుమరంగు లేదా ఎరుపు రంగులోకి మారితే అందులో కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి.
దీనిపై అవగాహన కల్పించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్సై) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో కల్తీ పరీక్షలు ఎలా చేయాలో చెప్పారు. ఈ పరీక్షను నిర్వహించడానికి దశలను చూద్దాం…
View this post on Instagram
శనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మైదా, గోధుమ వంటి ఇతర పిండ్ల కన్నా శనగ పిండిలో పీచు పదార్ధం ఎక్కువ. గ్లుటెన్ అనే ప్రొటీన్ల సమూహం ఈ పిండిలో అస్సలు ఉండదు. ఈ గ్లుటెన్ అనేది కాస్త అనారోగ్యకరమైన ప్రొటీన్. శనగ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర ప్రొటీన్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో, శనగపిండి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో ఒక కూర చేస్తారు. ఎక్కువగా చపాతి, రోటీలు, పూరీల్లోకి ఈ కూర తింటారు. మజ్జిగ పులుసులోకి, దప్పళంలోకి కూడా శనగపిండిని వాడతారు. ముఖ్యంగా కాకరకాయ వంటి కూరల్లో కూడా శనగపిండి వేస్తారు. అలా వేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. క్యాప్సికం, వంకాయ కూరల్లో కూడా ఈ పిండి చల్లుతారు. శనగపిండితో వేసే దోశ కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా తినే అల్పాహారం.
Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం




