వర్షాకాలంలో దోమలు పీకేస్తున్నాయా…ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి.. హాయిగా నిద్రపోవచ్చు..!
దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధుల వ్యాప్తి కూడా పెరుగుతుంది. అందువల్ల, మీ ఇంటి చుట్టూ దోమలను నిరోధించడం చాలా ముఖ్యం. వర్షా కాలంలో దోమల బెడద నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని ఈజీ టిప్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. వర్షా కాలంలో దోమలు కుడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే దోమల బెడద ఉండదు. అవేంటో ఇక్కడ చూద్దాం..

వర్షాకాలం మొదలైంది.. ఈ సీజన్‌లో దోమలు, ఈగల బెడద కూడా విపరీతంగా ఉంటుంది. వర్షం కారణంగా నిలిచిన మురుగు నీటిలో దోమలు త్వరగా, భారీగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధుల వ్యాప్తి కూడా పెరుగుతుంది. అందువల్ల, మీ ఇంటి చుట్టూ దోమలను నిరోధించడం చాలా ముఖ్యం. వర్షా కాలంలో దోమల బెడద నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని ఈజీ టిప్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. వర్షా కాలంలో దోమలు కుడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే దోమల బెడద ఉండదు. అవేంటో ఇక్కడ చూద్దాం..
మస్కిటో రిపెల్లెంట్లను శరీరానికి అప్లై చేసుకోండి. కొనే ముందు బాగా రీసెర్చ్ చేయండి. ఉదయం- సాయంత్రం వేళ లాంగ్ స్లీవ్స్ షర్టులు, ప్యాంటులు, సాక్స్‌లు వేసుకోండి. మస్కిటో నెట్లు కొనుక్కుని బెడ్ రూమ్‌లో పెట్టుకోండి. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
అలాగే, పరిశుభ్రతతో పాటు, కొన్ని మొక్కల సహాయంతో దోమలను తరిమికొట్టవచ్చు. సిట్రోనెల్ల, లావెండర్, మారిగోల్డ్ వంటి మస్కిటో రెపెల్లెంట్ప్లాంట్లను పెట్టుకోండి. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి మడుగు ఉండకూండా చూసుకోండి. దోమల బెడద ఎక్కువ ఉన్న చోట ఫ్యాన్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే దోమలు మీ వరకు చేరలేవు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…