Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే…ఎన్ని లాభాలో తెలిస్తే..

మెంతుల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అనేక రకాల ఆహార పదార్థాలు, పచ్చళ్లలోనే కాకుండా కేశాల అభివృద్ధికి, సౌందర్యలేపనంగా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను మెంతులు నివారిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతి గింజలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే...

Jyothi Gadda
|

Updated on: Jun 06, 2025 | 10:20 AM

Share
మెంతి గింజల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మెంతి గింజల నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో బాగా పనిచేస్తుంది. మెంతి గింజల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రాణాంతక గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది.

1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతి గింజల నీటిని తీసుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. విటమిన్లు, ఖని, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతి నీటిని తీసుకోవడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గుతుంది. బరువును సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.

2 / 5
చర్మం, జుట్టు ఆరోగ్యానికి నానబెట్టిన మెంతులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మెంతి నీరు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మెంతి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే, ఇది అజీర్ణం, ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా. అందువల్ల, మెంతి నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో, నివారించడంలో కూడా సహాయపడుతుంది.

4 / 5
మెంతి నీరు ఋతుస్రావం సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. క్రమరహిత ఋతుస్రావ సమస్యను తొలగిస్తుంది. అలాగే, మెంతి నీరు ఋతుస్రావం సమయంలో ఉబ్బరాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టు రాలడం, పొడి చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

5 / 5