Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Plants: చెట్లకు డబ్బులు కాస్తాయా? ఇది చదవితే కాదనలేరేమో! లక్కీ మనీ ప్లాంట్స్ ఇవే..

పిల్లలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ.. అస్తమాను డబ్బులు కావాలని విసిగిస్తుంటే సాధారణంగా పెద్దలు వారిని వారించడానికి ‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వనూ?’ అంటూ ఉండటం మనం సాధారణంగా గమనించే ఉంటాం. అయితే మొక్కలు ఇంటి పరిసరాల్లో వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చడంతో పాటు ఆక్సిజన్ అందిస్తూ మన ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. ఇదే క్రమంలో ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మంగళకరమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాక ఇవి శ్రేయస్సు, సంపదను ఆకర్షిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు.

Money Plants: చెట్లకు డబ్బులు కాస్తాయా? ఇది చదవితే కాదనలేరేమో! లక్కీ మనీ ప్లాంట్స్ ఇవే..
Lucky Money Plants
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2023 | 11:36 AM

పిల్లలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ.. అస్తమాను డబ్బులు కావాలని విసిగిస్తుంటే సాధారణంగా పెద్దలు వారిని వారించడానికి ‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వనూ?’ అంటూ ఉండటం మనం సాధారణంగా గమనించే ఉంటాం. అది సాధ్యం కాదు అని దాని అర్థం. వాస్తవ పరిస్థితుల్లో డబ్బులు కష్టపడి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మొక్కలు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి అవసరం. అలాగే ఇంటి పరిసరాలు, ఆవరణం అందంగా కనిపించడానికి కూడా కొన్ని రకాల మొక్కలను మనం వినియోగిస్తూ ఉంటాం. అయితే ఈ మొక్కల వల్ల గాలి శుద్ధీకరణ జరుగుతుంది. తద్వారా మంచి గాలిని ఆ ఇంట్లో వ్యక్తులు శ్వాసించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా శ్వాస సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది. అలా మొక్కలు మన డబ్బును ఆదా చేసిపెడతాయి కూడా. ఈ విధంగా ఆలోచిస్తే ఇంట్లో చెట్లు నిజంగానే డబ్బును అందించేవే.

మరో విధంగా చూస్తే ఇంటి పరిసరాల్లో వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేందుకు గ్రీనరీ ఉపయోగపడుతుంది. పాజిటివ్ వైబ్స్ రావడానికి చెట్లు దొహదపడతాయి. ఇదే క్రమంలో ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మంగళకరమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాక ఇవి శ్రేయస్సు, సంపదను ఆకర్షిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు. అలాంటి వారు ఈ మొక్కలను తప్పనిసరిగా మీ ఇంటి ఆవరణలో పెంచేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా అలాంటి లక్కీ మనీ మొక్కల గురించి తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మీకు పరిచయం చేస్తున్న మొక్కలతో మీ ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనపించడంతో పాటు ధనసమృద్ధిని కలుగజేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

జేడ్ మొక్క.. దీనిని మోహినీ మొక్క అని కూడా పిలుస్తారు. ఇంగ్లిష్లో జేడ్ ప్లాంట్ అని అంటారు. జేడ్ మొక్క ముఖ్యంగా ఆసియా సంస్కృతులలో, అదృష్టం, ఆర్థిక శక్తితో అనుబంధం ఉన్నట్లు పరిగణిస్తారు. ఆకుపచ్చ ఆకులు, పచ్చ నాణేలు లేదా రాళ్లను పోలి ఉంటాయి. ఇవి పెరుగుదల, పునరుద్ధరణను సూచిస్తాయి. ఇంట్లో లేదా కార్యాలయంలో జేడ్ మొక్కను ఉంచడం ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడే సానుకూల శక్తులను ఆకర్షిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మనీ ప్లాంట్.. దీనిని శాస్త్రీయంగా పచిరా ఆక్వాటికా అని పిలుస్తారు. ఈ మనీ ప్లాంట్ అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఒక ప్రసిద్ధ ఇండోర్ ప్లాంట్. సంపదతో ఒకరి జీవితాన్ని సుసంపన్నం చేయడంలో సాయపడుతుంది. అంతేకాక ఇది గాలి-శుద్దీకరణ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది.

లక్కీ వెదురు.. దీనిని మనం తరచూ బహిరంగ తోటలలో చూస్తూ ఉంటాం. లక్కీ వెదురు అనేది ఒక నిర్దిష్ట రకం. దీనిని ఇంటి లోపల కుండలలో నాటవచ్చు. వివిధ సంప్రదాయాలలో, లక్కీ వెదురు అదృష్టం, సంపదకు దూతగా అభివర్ణిస్తారు. దీని చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, ఇది ఏదైనా గదికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు.

తులసి.. అనేక భారతీయ గృహాలలో ఇది మనకు కనిపిస్తుంది. ఇది ఒక మూలికా గుణాలు కలిగిన మొక్క. మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. తులసి దాని ఔషధ గుణాలతో పాటు, ఇంటికి సంపద, అదృష్టాన్ని తెస్తుంది. దాని సుగంధ ఉనికి పరిసరాలకు సానుకూల ప్రకంపనలను జోడిస్తుంది.

అలోవెరా.. చర్మ సంరక్షణ కోసం దీనిని వివిధ విధానాల్లో వినియోగిస్తుంటారు. ఈ చెట్టు ఇంట్లో ఉంచినప్పుడు అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. దీని ఉనికి సానుకూల శక్తిని, శ్రేయస్సును మెరుగుపరుస్తుందని భావిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..