AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌లో ఫుడ్‌ గురించి ఏం వెతికారో తెలుసా.? 2023లో టాప్‌ సెర్చింగ్‌ ఇవే..

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కోసమైనా గూగుల్‌లో వెతికే రోజులు వచ్చాయి. ఎడ్యుకేషన్‌ మొదలు చివరికి వంటల వరకు ఆన్‌లైన్‌లోనే సెర్చ్‌ చేస్తున్నారు. గూగుల్‌లో వంటలు సెర్చ్‌ చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్‌లో ఆహారానికి సంబంధించి ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తేలింది. ఇంతకీ యూజర్లు గూగుల్‌లో ఎలాంటి ఆహార పదార్థాలకు సంబంధించి సెర్చ్‌ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

Google: గూగుల్‌లో ఫుడ్‌ గురించి ఏం వెతికారో తెలుసా.? 2023లో టాప్‌ సెర్చింగ్‌ ఇవే..
Rewind 2023
Narender Vaitla
|

Updated on: Dec 11, 2023 | 3:42 PM

Share

2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. పాత ఏడాది మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు ఇప్పుడే ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే 2023 ఏడాది ముగుస్తున్న సమయంలో ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది ఏం సెర్చ్‌ చేశారన్నదానిపై ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కోసమైనా గూగుల్‌లో వెతికే రోజులు వచ్చాయి. ఎడ్యుకేషన్‌ మొదలు చివరికి వంటల వరకు ఆన్‌లైన్‌లోనే సెర్చ్‌ చేస్తున్నారు. గూగుల్‌లో వంటలు సెర్చ్‌ చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్‌లో ఆహారానికి సంబంధించి ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తేలింది. ఇంతకీ యూజర్లు గూగుల్‌లో ఎలాంటి ఆహార పదార్థాలకు సంబంధించి సెర్చ్‌ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీ ఆధారంగా తెలిపిన ఈ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతాన్నారని తేలింది. ఈ క్రమంలోనే గూగుల్ 2023లో అత్యధికంగా శోధించిన ఆహారాల జాబితాను విడుదల చేసింది. రుచితో పాటు ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఏ ఆహారాలు బాగా ప్రాచుర్యం పొందాయో తెలుసుకుందాం.

* 2023లో మిల్లెట్స్‌ గురించి ప్రజలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తిచూపించారు. వీటిలో ప్రముఖంగా బార్లీ, కొడ్రా, రాగి, కుట్కి వంటి వాటి గురించి వెతికారు. అలాగే మిలెట్స్‌తో తయారు చేసుకునే వంటకాల గురించి కూడా ఎక్కువగా వెతికారు. దీనిబట్టి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగినట్లు స్పష్టమవుతోంది.

* గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, హెల్తీ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అలాగే ఇందులోని పొటాషియం, ఫైబర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కారణంగానే గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌లో అవకాడో నిలిచింది.

* గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌లో మటన్‌ రోగన్‌ జోష్‌ మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. ఈ ఫుడ్‌ ఐటమ్‌ కశ్మీరీ వంటకం. నాన్‌ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ ఫుడ్‌ను 2023లో గూగుల్‌లో ఎక్కువసార్లు సెర్చ్‌ చేశారు.

* 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాలలో కాథి రోల్స్‌ 4వ స్థానంలో నిలిచింది. చికెన్‌ లేదా కూరగాయలతో తయారు చేసే ఈ రోల్స్‌కు ఫుడ్‌ లవర్స్‌ ఫిదా అవుతారు. కోల్‌కతాకు చెందిన ఈ స్పెషల్‌ ఫుడ్‌ చపాతిని రోల్‌గా చేసి అందులో చికెన్‌ లేదా వెజ్‌ కర్రీస్‌తో వడ్డిస్తారు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..